Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

ఈ చేపలు గుండె బాగుచేసుకుంటాయి!

మనిషికి వచ్చే వ్యాధులు, లక్షణాలు, చికిత్స, ఔషధాలను కనిపెట్టే పరీక్షల్లో విస్తృతంగా వాడే చేప ఇది. దీని శరీరంపై ఉండే నీలిచారల వల్ల వీటికి జీబ్రాఫిష్ అన్నపేరు వచ్చింది. క్షయ, కేన్సర్, ఇన్‌ఫ్లుయంజా సహా మరికొన్ని వ్యాధులకు సంబంధించిన పరిశోధనలు వీటిపై చేస్తున్నారు. అంతరిక్షంలోకి పంపిన జీవుల్లో ఇవీ ఉన్నాయి. కంటిలోని రెటీనా, గుండె, ఇతర భాగాలు దెబ్బతిన్నప్పుడు వాటిని మరమ్మతు చేసుకోవడం, పునరుద్ధరించుకోవడం వీటి ప్రత్యేకత. అందువల్లే వైద్యరంగంలో వీటికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. పారదర్శకంగా కనిపించే ఎంబ్రియోలో గుడ్లు పెడతాయి. వాటి ఎదుగుదలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చుకూడా.

- ఎస్.కె.కె. రవళి

లతలా పెరిగే రోబో

భవనాల శిథిలాలు, ఇరుకైన, లోతైన, సన్నని ప్రదేశాల్లోకి కూడా చొచ్చుకుపోయే ఒక సరికొత్త రోబోను రూపొందిస్తున్నారు. తీగజాతి మొక్కల్లోని లతల్లా పెరుగుతూ సూక్ష్మ ప్రదేశాల్లోకి వెళ్లిపోయే రోబో అన్నమాట ఇది. ఒక గొట్టంలా ఉండే ఈ రోబో ఒకవైపు భాగం స్థిరంగా, కదలకుండా ఉంటుంది. రెండో కొస పెరుగుతూ మనం ఇచ్చే ఆదేశాల ప్రకారం పెరుగుతూ వెళుతుంది. ఆ పెరిగో కొన చివర్లో ఉండే అతి సూక్ష్మ, చక్కగా పనిచేసే కెమెరా అమర్చి ఉంటుంది. అది చొచ్చుకువెళ్లిన ప్రాంతాల్లోని దృశ్యాలను చిత్రీకరించి పంపుతుంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో వీటివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి

ఇవి ఎక్కువగా ఉంటే కాలుష్యం లేనట్టే

బల్లులు, కప్పల మాదిరిగా కనిపించే ‘సలమాండర్’లు విభిన్నమైన ఉభయచర జీవులు. వీటిలో మైన్యూట్ సలమాండర్ జాతి జీవులు కేవలం ఒకటిన్నర మిల్లీమీటర్ పొడవుంటే చైనా జెయింట్ సలమాండర్ ఏకంగా ఆరు అడుగుల పొడువుంటుంది. స్లిమ్‌గా ఉండే సున్నితమైన, అందమైన చర్మం వీటి సొత్తు. బల్లులు, ఇతర ఉభయచరాల చర్మంకన్నా ఇది కాస్త భిన్నంగా, ఒకరకమైన జిగురుపదార్థంతో ఉంటుంది. ఇది విషతుల్య పదార్థం. శత్రువుకు చిక్కినా ఈ పదార్థం వల్ల అవి తినలేవు. వీటి చర్మం అతి సున్నితంగా ఉండటం వల్ల కాలుష్యాన్ని, విషవాయువులను తట్టుకోలేవు. గాలిలోని విషాలు వీటి శరీర భాగాల్లోకి చర్మంద్వారా వెళ్లడం వల్ల అవి మరణిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

తిన్నది అరిగేందుకు పక్షం పడుతుంది!

ఆస్ట్రేలియాలో కనిపించే ‘వొమ్‌బొట్’ అనే జీవి గట్టిగా ఉండే ఆహారానే్న తింటుంది. గట్టి దుంపలు, బెరడు, వేర్లు ఇలా అన్నమాట. దీని ఉదరంలో విడుదలయ్యే ప్రత్యేక రసాయనాలు ఎంతటి గట్టి ఆహారాన్నైనా చిన్నచిన్న తునకలుగా మార్చేస్తాయి. అయితే ఒకసారి ఇది ఆహారం తింటే అది పూర్తిగా జీర్ణమవడానికి పదిహేనురోజులు పడుతుంది. మనుషులు తిన్న ఆహారం పూర్తిగా అరగడానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే అవసరమవుతుంది. ఇక ఇది బొరియలు తవ్వడంలో నైపుణ్యం కల జీవి. 650 అడుగుల పొడవైన మార్గాలను, ఒకదానిలోంచి ఒకదానిలోకి వెళ్లేందుకు వీలుగా విభిన్నమైన రీతిలో చాలా మార్గాలను, బొరియలను తవ్వుతుంది.

- ఎస్.కె.కె. రవళి

చీమలకు రెక్కలొస్తాయెందుకు!

చినుకులు పడ్డప్పుడు, లేదా మండువేసవిలో రెక్కల చీమలు, రెక్కల చెదపురుగులు విస్తృతంగా కనిపిస్తాయి. లెక్కలేనన్ని పుట్టుకొస్తాయి. ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. కానీ మామూలుగా ఉండే ఈ చీమలకు రెక్కలు ఎందుకు వస్తాయి. ఇది ఓ ప్రకృతిధర్మంగా చెప్పుకోవాలి. చీమలు సమూహంగా కలసిమెలసి ఉంటాయి. వాటిలో రాణిచీమ సంతానోత్పత్తి చేస్తుంది. మగచీమలు సంపర్కం తరువాత చనిపోతాయి. కొన్నిలక్షల చీమల సమూహాన్ని కాలనీ అంటారు. అది నిండిపోయినప్పుడు కొత్త కాలనీలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈలోగా ఈడుకొచ్చిన ఆడ, మగ చీమలు జతకట్టే సమయం వస్తుంది. వాతావరణం అనుకూలించినప్పుడు ఇలా జతకట్టాల్సిన ఆడ, మగ చీమలకు రెక్కలొస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

‘బెర్రీ పళ్ల’తో ఆడుకుంటాయెందుకు?

వాక్స్‌వింగ్ పక్షుల్లో ‘బెహమిన్ వాక్స్‌వింగ్’ పక్షులది ప్రత్యేక శైలి. తోక, రెక్కల చివర్లలో ఉండే ఎర్రటి మెత్తటి గుర్తుల వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలో ఉత్తరాలు, కవర్లకు వేసే ఎర్రటి సీల్‌కు వాడే మైనాన్ని పోలినట్లు వీటి గుర్తులు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. బెర్రీ పళ్లంటే ఈ పక్షులకు ఇష్టం. జతకట్టే ఆడమగ పక్షులు పరస్పరం బెర్రీ పళ్లను బహుమతిగా ఇచ్చుకుంటాయి. ఒక పండును పరస్పరం అందించుకునేందుకు ప్రయత్నిస్తాయి. బెర్రీని మగపక్షి ఆడపక్షి చెంతకు నెడితే, దానిని ఆడపక్షి తిరిగి మగపక్షి చెంతకు తోస్తుంది. మన పెళ్లిలో వధూవరులు పూలబంతులాట ఆడినట్లన్నమాట.

- ఎస్.కె.కె. రవళి

ఈ సాలీడును ‘బ్లాక్ విడో’ అంటారెందుకు?

నల్లగా, ఎర్రటి మచ్చలతో కనిపించే ఈ సాలీళ్లను ‘బ్లాక్ విడో స్పైడర్’గా పిలుస్తారు. ఉత్తర అమెరికాలోని అలస్కా మినహా అన్నిచోట్లా ఇవి కనిపిస్తాయి. సాలీళ్ల జాతిలో అతి ధృడమైన దారాన్ని అల్లుకునేవి ఇవే. చక్కటి గూడును అల్లుకున్న ఆడసాలీడుతో జతగట్టేందుకు మగసాలీళ్లు వేచిచూస్తాయి. నచ్చిన మగసాలీడుతో జతకట్టిన వెంటనే ఆడసాలీళ్లు మగవాటిని చంపి తినేస్తాయి. అందువల్లే వాటికి ‘బ్లాక్ విడోస్’ అన్న పేరు వచ్చింది. పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించేందుకే అవి అలా చేస్తాయని అధ్యయనాల్లో తేలింది. జతకట్టడానికి ముందే ఆడసాలీళ్లు ఆహారాన్ని తిని ఉంటే ఇవి బతికిపోయినట్లే.

- ఎస్.కె.కె. రవళి

కందిరీగలకు భయమేస్తే...

ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, భయపడినా కందిరీగలు ఒక రకమైన రసాయనాన్ని (ఫెరోమోన్) విడుదల చేస్తాయి. సమీపంలోని ఇతర కందిరీగలు దీని వాసన గమనించి ప్రమాదంలో చిక్కుకున్నవాటిని రక్షించేందుకు మూకుమ్మడిగా అక్కడికి చేరుకుంటాయి. శత్రువుపై దాడి చేస్తాయి. ఆడ కందిరీగలకు ఉండే ముల్లు పదేపదే కాటువేసినా ఊడిపోదు. అదే తేనెటీగల్లో ఒక ఈగ ఒకసారి కుట్టిన వెంటనే శత్రువుశరీరంపై ఆ ముల్లు ఉండిపోతుంది. ఉదరం, రెక్కల రూపురేఖల్లో కందిరీగలకు, తేనెటీగలకు తేడా తెలుస్తుంది. పాడైన చెట్ల బెరడును చీల్చి, పిప్పి చేసి కాగితపు పొరల్లా చేసి గూళ్లను ఏర్పాటు చేసుకోవడం వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి

కుందేళ్ల వేటలో అగ్రగామి

వీజిల్’ కుటుంబానికి చెందిన ఈ క్షీరదం పేరు ‘ఫెర్రెట్’. కుందేళ్లను వేటాడటంలో ఇవి నెంబర్ వన్. ఎంతటి ఇరుకైన ప్రాంతంలోంచైనా దూరి వచ్చేయగల ఈ జంతువులను కేబుల్ లైనింగ్, విమానాల్లో వైరింగ్, టన్నల్ నిర్మాణాలలో వైరింగ్ పనులకు వీటిని ఉపయోగిస్తారు. ఒక దుర్గంధభరిత ద్రవాన్ని విసర్జించి ఆహారాన్ని దొంగిలించే నేర్పున్న వీటిని ‘సెల్లీ లిటిల్ థీఫ్’ అని పిలుస్తారు. అమెరికన్లు ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో పిల్లి, కుక్కల తరువాతి స్థానం వీటిదేనంటే
నమ్మాలిమరి.

- ఎస్.కె.కె. రవళి

‘బుద్ధ భంగిమ’ ఈ పిల్లి ప్రత్యేకత

స్కాంటాండ్‌కు పుట్టిన ఈ సంకరజాతి పిల్లులను ‘స్కాటిష్ ఫోల్డ్ క్యాట్’ అని పిలుస్తారు. పొట్టిగా, మడతపెట్టినట్లు ఉండే చెవుల వల్ల వీటికి ఈ పేరు వచ్చింది. అయితే ఇదే జాతిలో నిటారుగా చెవులుండే పిలులూ ఉంటాయి. కాకపోతే వాటి సంఖ్య చాలా తక్కువ. వాటిని ‘స్ట్రెయిట్స్’ అని పిలుస్తారు. ఈ స్కాటిష్ ఫోల్డ్ పిల్లులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బొద్దుగా, ముద్దుగా ఉండే ఇవి మిగతా పిల్లులకన్నా వినసొంపుగా అరుస్తాయి. వీపును నేలకు ఆన్చి పడుకోవడం వీటి అలవాటు.

- ఎస్.కె.కె. రవళి

Pages