Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

‘సన్ బేర్’కు ఆ పేరు ఎలా వచ్చింది?

మలేసియా, వియత్నాం, థాయ్‌లాండ్, భారత్ తదితర ప్రాంతాల్లో కనిపించే ‘సన్ బేర్’ ఎలుగుబంట్లు ‘బేర్’ జాతి జీవుల్లో అతి చిన్నవి. ఐదారు అడుగుల ఎత్తు పెరిగే వీటికి ఛాతీపై సూర్యుడిలాంటి పసుపు లేదా జేగురు రంగు మచ్చ ఉండటం వల్ల వాటికి సన్‌బేర్ అన్న పేరు వచ్చింది. మొక్కల చాటున నక్కి ఉండి శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించే ఇవి తేనె, చెదలు, చీమలను ఎక్కువగా తింటాయి. పుట్టలు, పట్లు, చెట్ల దుంగల మధ్య ఉండే పురుగులను నాలుకతో ఊర్చి తింటాయి. అందుకే మిగతా ఎలుగుబంట్లకు భిన్నంగా వీటి నాలుకు పది అంగుళాల పొడవుంటుంది. వీటి చేతులు, కాళ్లకు ఉండే గోళ్లు మిగతా జాతి ఎలుగులుకన్నా బలంగా ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి

వీటిని ‘నీటి పాండాలు’ అని పిలుస్తారు!

పాండాల్లా కళ్లచుట్టూ నల్లని చారలు, మూతివద్ద నల్లటి మందమైన లైనింగ్, మిగతా శరీరమంతా గ్రే కలర్‌లో ఉండి చూడటానికి ముచ్చటగా ఉండే ఈ వేల్‌జాతి జీవులను ‘నీటి పాండా’లుగా పిలుస్తారు. కాలిఫోర్నియా జలసంధి, మెక్సికో జలాల్లో కనిపించే ‘వక్విటా’ జీవజాతి దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 150కు మించి లేవు. చేపలవేట కోసం వేసే వలలే వీటి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ వలల్లో చిక్కుకుపోయి ఎక్కువసేపు కదలకుండా ఉండిపోవడం వల్ల ఆక్సిజన్ అందక అవి మరణిస్తున్నాయి. నీటిలో అట్టడుగున జీవించే ఈ జలచరాలు మనుషులు, పడవలకు దూరంగా వెళ్లిపోతూంటాయి.

- ఎస్.కె.కె. రవళి

ఈ ఆక్టోపస్‌లకు చెవులుంటాయ్!

తలపై రెండువైపులా చెవుల్లాంటి ‘్ఫన్స్’ ఉన్న ఈ జలచరాన్ని ‘డుంబో ఆక్టోపస్’ అని పిలుస్తారు. ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ కేరక్టర్ డుంబో పేరు దీనికి పెట్టారు. పెద్దచెవులు, చిన్న శరీరం, ఎగరగలిగే శక్తితో కూడిన ఆ ఏనుగును పోలినట్లు ఉండటం వల్ల ఈ ఆక్టోపస్‌కు ఆ పేరు వచ్చింది. మిగతా ఆక్టోపస్‌లకు భిన్నంగా వీటికి తలపై ఇరువైపులా చెవుల్లా రెక్కల్లాంటి భాగాలుంటాయి. వీటికి ఎనిమిది చేతులు ఉండి మిగతా ఆక్టోపస్‌లకు భిన్నంగా అన్నీ ఒకదానితో ఒకటి కలసి ఒక వెబ్‌ఫుట్‌లా పనిచేస్తాయి. తలపై చెవులను ఆడిస్తూ ఇవి నీటిలో ప్రయాణం చేస్తాయి. వేగంగా వెళ్లేందుకు నీటిని వెనక్కు తోసేందుకు చేతుల్లాంటి టెంటకిల్స్‌ను వినియోగిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

ఎగరలేని చిలుకలు

ఆకుపచ్చగా అందంగా కనిపించే రామచిలుకలంటే ఇష్టపడనివారుండరు. కానీ న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ‘కకాపో’ అనే చిలుకలు ఎగరలేవు. పైగా వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎగరలేని, అతిపెద్ద రామచిలుకలు ఇవే. వాటి రెక్కలు మిగతా చిలుకలకన్నా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. కానీ వాటికి వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. వాటి కాళ్లు బలంగా ఉండి చెట్లు ఎక్కడానికి ఉపయోగపడతాయి. ఆహారం కోసం కనీసం 5 కి.మీ. దూరమైనా నడచివెళ్లే శక్తి వాటికి ఉంది. చెట్లపై నుంచి నేలమీదకు రావడానికి కొద్దిదూరం వరకు ‘పారాచ్యూటింగ్’ శైలిలో దిగుతాయి. వీటికి మరో విశిష్టత ఉంది.

- ఎస్.కె.కె. రవళి

బ్రకోలి తింటే ఆకలి పెరుగుతుంది!

క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒకరకమైన ఆకుకూర బ్రకోలి. ఇటలీకి చెందిన ఈ బ్రకోలీ నిజానికి పుష్పగుచ్చపు పైభాగం అన్నమాట. గాఢమైన ఆకుపచ్చని వర్ణంలో ఉండే పుష్పగుచ్చాన్ని పచ్చిగాను, ఉడకబెట్టి తింటారు. వీటిలో ఉండే గ్లుసినోలేట్స్ కళ్లకు మేలు చేస్తాయి. గ్లుకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. మిగతా కూరల్లో లేనంత విటమిన్ సి, ఎ, కె వీటిలో ఉంటాయి. వంద గ్రాముల బ్రకోలిలో ఉండే విటమిన్ సి, ఒక కమలాపండు రసంలో ఉన్న సి విటమిన్ పరిమాణానికి సమానంగా ఉంటుందంటే విషయం అర్థమవుతుంది. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్స్ కరోటినాయిడ్స్ జీర్ణాశయ గోడలు, రక్తనాళాల లోపలి పొరలను సురక్షితంగా ఉంచుతాయి.

- ఎస్.కె.కె. రవళి

ఈ పక్షులకు గడ్డి ఇష్టం

సాధారణంగా పళ్లు, గింజలు, కీటకాలను పక్షులు తింటాయి. కానీ న్యూజిలాండ్‌లో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షి ‘టకాహే’ గడ్డిని ఇష్టంగా తింటుంది. ఫెర్న్‌వంటి మొక్కల మొదళ్లను, కాడలను ఆరగిస్తుంది. 1800-1900 సంవత్సరాల మధ్య విస్తృతంగా కనిపించిన ఈ పక్షులు ఉన్నట్లుంది కనుమరుగయ్యాయి. దాదాపు అంతరించిపోయాయనుకున్నారంతా. కానీ డాక్టర్ జెఫ్రీ ఆర్‌బెల్ అనే శాస్తవ్రేత్త న్యూజిలాండ్ అంతటా వీటి ఆచూకీ కోసం వెతికివెతికి విజయం సాధించాడు. శత్రుపీడ లేని ఒక కొండలోయల్లో తిరుగుతున్న వీటిని 1948లో ఆయన కనిపెట్టాడు. అనేక సంరక్షణ చర్యలు తీసుకున్న తరువాత ప్రస్తుతం వీటి సంఖ్య 150కు పెరిగింది.

- ఎస్.కె.కె. రవళి

వర్షం ఆగాక పాడే పక్షులు

యురేసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే ‘బ్లాక్ బర్డ్స్’ అద్భుతంగా కూస్తాయి. వాటి పాట వింటే మనసు తేలికపడుతుంది. మన కోకిల మాదిరిగా వాటి పాటలను అక్కడివారు ఆస్వాదిస్తారు. వీటిలో ఏడాదిలోపు పక్షులు జనవరి చివరి నుంచి ఫిబ్రవరిలో మాత్రమే పాట అందుకుంటాయి. ఎదిగిన పక్షులు మార్చి నుంచి జులై మధ్య పాడటం అలవాటు. సాధారణంగా వర్షం కురిసిన తరువాత కూయడం వీటికి ఎంతో ఇష్టం. కళ్ల చుట్టూ పసుపుపచ్చని వలయం, అదేరంగులో ఉండే ముక్కు వీటికి అందాన్నిస్తాయి. మగపక్షులు నల్లగా ఉంటాయి. ఆడపక్షులు కాస్త లేత గోధుమవర్ణంలో ఉంటాయి. ఎదపై ఎర్రటి మచ్చతో ఉండే పక్షులూ వీటిలో ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి

వేకువవేళ పాడుతాయ!

ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ ‘హనీఈటర్’ పక్షుల పాట మనోహరంగా ఉంటుంది. సూర్యోదయానికి ఓ గంట ముందు ఓ అరగంటపాటు మగపక్షులు అద్భుతంగా చేసే కువకువలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ముక్కునుంచి కళ్లమీదుగా చెవుల వెనుక వరకు నల్లచి చారలు వీటికి కొత్త అందాన్నిస్తాయి. వీటికి తేనె అంటే చాలా ఇష్టం. పూల చుట్టూ ఎగురుతూ ప్రత్యేకంగా ఉండే ‘బ్రష్ టిప్‌డ్’ నాలుకతో తేనెను జుర్రుకుంటాయి. అయితే హమ్మింగ్‌బర్డ్‌లా ఎక్కువ సేపు గాలిలో ఎగురుతూ ఉండవు. కానీ ఆ పక్షికన్నా నేర్పుగా, తలకిందులుగా ఎంతసేపైనా వేళ్లాడుతూ పూలలోని మకరందాన్ని పీల్చుకోగలగడం వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి

పుట్టినప్పుడు నల్లగా ఉంటాయ్!

తిమింగలా(వేల్)ల్లో అతి చిన్నవాటిలో ఒకటైన బెలుగా వేల్స్ ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. పుట్టినపుడు నల్లగా లేదా గోధుమవర్ణంలో ఉండే ఇవి వయసు పెరిగేకొద్దీ తెల్లని తెలుపుతో మెరిసిపోతాయి. మిగతా తిమింగలాలకు భిన్నంగా మెడను ఎటుకావాలంటే అటు, గుండ్రంగానూ తిప్పగలగడం వీటి ప్రత్యేకత. 13 నుంచి 22 అడుగుల పొడవు పెరిగే ఇవి చిన్న తిమింగాల్లో ఒక జాతికి చెందినవి. నీటి బుడగలను వదలడం, శబ్దాలతో అల్లరి చేయడం, తీవ్రస్వరంతో గుంపుగా పాటలు పాడిన తరహాలో శబ్దాలను చేయడం వీటి మరో అలవాటు. మిగతా జీవులను, మనుషుల మాటలను అనుకరించడం వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి

రోజుకు 20వేల చెదలను తింటాయ్!

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జంతువు పేరు ‘నంబట్’. దీనికి చెదలు, చీమలంటే ఇష్టం. చెదలు, చీమలు పెట్టిన పుట్టలను ఇవి ఏమాత్రం పాడుచేయవు. చెదలు లేదా చీమలు బయటకు వచ్చేవరకు అవి ఓపికగా వేచి చూస్తాయి. వచ్చిన వెంటనే నాలుకతో లాక్కుని తింటాయి. ఒక్కో నంబట్ రోజుకు కనీసం 20వేల చెదలను తింటుంది. తన శరీరం బరువులో ఇది పదిశాతం. వేసవిలో పగటిపూట పుట్టలను వదిలి చెదలు ఎక్కువ సేపు బయటకు వస్తాయి. అలాగే శీతాకాలంలో ఎండబాగా కాసినప్పుడు అంటే మధ్యాహ్నం వేళ బయటకు వస్తాయి. ఆయా సమయాలు, వాతావరణాన్ని బట్టి ఈ జంతువులు అక్కడికి చేరుకుని ఆహారాన్ని సంపాదించుకోవడం విశేషం.

Pages