S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 21:33

ఎందుకో తెలియదుగానీ,
గత కొంతకాలంగా నేను ప్రపంచ సాహిత్యంలోని కథా సంకలనాలను చాలా సేకరించి చదువుతున్నాను. నాకు అక్కడక్కడ నిజంగా ఆశ్చర్యకరమయిన రచనలు ఎదురవుతున్నాయి. నా మనసులోని భావాలను అవి బలపరుస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో, సారస్వత
పరిషత్‌లో అనుకుంటాను, జరిగిన ఒక సమావేశానికి వెళ్లడం
గుర్తుకు వస్తున్నది.

12/03/2016 - 21:26

* ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ ట్యాంపరింగ్‌లో కొత్త విధానాన్ని అనుసరించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. 1977లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ మొదటి రెండు టెస్టులను గెల్చుకుంది. చెన్నైలో మూడో టెస్టు జరుగుతున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీ పదేపదే నుదుటిని చేత్తో రుద్దుకుంటూ, దానిని బంతిపై రాస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు.

12/03/2016 - 21:22

‘సూపర్‌మూన్ వస్తోంది’ కవర్‌స్టోరీ కథనంలో పలు ఆసక్తిదాయక విశేషాలు తెలుసుకొన్నాం. మూన్ విశిష్టత కూడా తెలిసింది. ఎడిటర్‌తో ముఖాముఖి ‘మనలో మనం’ ద్వారా పలు అంశాలపై ఎడిటర్‌గారు ఇస్తున్న సమాధానాలు బాగుంటున్నాయి. అమృతవర్షిణి అమృతంలా ఉంటోంది. సిసింద్రీ ఆకట్టుకుంటోంది. వారంవారం సరికొత్త అంశాలతో మమ్మల్ని అలరిస్తోన్న భూమికి ధన్యవాదాలు.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం)
సూపర్

12/03/2016 - 21:21

కళ్లజోడుతో
దాగుడుమూతలాట
తాత ఛాదస్తం!
అల్లుడి కోసం
కోడి ప్రాణాలు హరీ..
లేకుంటే మామ..?

ఊరకుక్కలు
పళ్ల పదును కోసం
పిక్కలవేట.
స్వేచ్ఛా విరోధి
విశ్వాసరాహిత్యమే
కపట న్యాయం.

ముద్దు ముద్దులో
మురిపెం తల్లి ప్రేమ
పువ్వులో తావి.

12/03/2016 - 21:15

ఆంక్షల మధ్య ఆకాశం
తెగిపోయినట్టుగా
కనిపిస్తుంది
అసలు మెరవటమే మానుకుంది
ఏ మెరుపూ లేదు. ఏ తూర్పు కనిపించటంలేదు.
ఆంక్షలు ఇప్పటివా
స్వాతంత్య్రం ఆకాశాన్ని ఆంక్షలలో బంధించింది
ఆకాశం నా స్వేచ్ఛకు ప్రతీక
నేనో పిట్టను
నేనో పావురాన్ని
ఆకాశాన్ని కత్తిరించటమే కాదు
నా రెక్కలను కూడా కత్తిరించారు
దుర్మార్గ రాజకీయాల గుప్పిట్లో

12/03/2016 - 21:12

నిశ్శబ్దం
విస్ఫోటనమైతే శబ్దం..
వౌనం
ప్రస్ఫుటమైతే భాష్యం...
అక్షరం
వ్యక్తమయితే వాక్యం...
కావ్యం
ఆవిష్కృతమైతే అమరం...
అంతరంగం
బోధపడితే అనురాగం..
రాగబంధాలన్నీ
వర్జిస్తే వేదాంతం...
రవికి తేజస్సు జ్వలనం
కవికి యశస్సు కవనం.

12/03/2016 - 21:11

నిజంగా మనం అనుకునేవేవీ
మనవి కాదు
ఆనందాలు ఆనందాలు కాదు
సుఖాలు సుఖాలు కాదు
దుఃఖపు వీచికలను
గుండె పేటికలో దాచుకుని
శ్వాసించే పాకులాటలు
భ్రమల వలయాలు
ఉల్లిపొరలను తొలుచుకుంటూ పోతే
రాలే కన్నీళ్లు
మిగిలే ఆవిరి ధారలు
మెరుపుల్ని పెనవేసుకున్న చినుకుల్లా
క్షణాలు మోసే కన్నీళ్లు
పొగిలిన గుండెను ప్రసవిస్తూ

12/03/2016 - 21:04

వయస్సుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా హుషారుగా ఉంటుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని, టీషర్ట్‌లు వేసుకుని కూడా కన్పిస్తుంటారు. మీసాలకి, తల వెంట్రుకలకి రంగు వేసుకొని కూడా దర్శనం ఇస్తుంటారు. వాళ్ల వయస్సు ఓ పది నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గినట్టుగా కూడా కన్పిస్తుంటారు. వాళ్లు తమ యుక్తవయస్సులో కూడా అంత శ్రద్ధ తీసుకొని ఉండరు.

12/03/2016 - 20:57

అనంతమయుడు, అర్థనారీశ్వరుడు, యావత్ జగతికి శక్తి ముక్తి ప్రదాయకుడు అయిన శివుడి లీలల్ని జ్ఞానులైనా, ఆధ్యాత్మిక విజ్ఞానఖనులైనా, చక్రవర్తులైనా, రారాజులు, రాజులు అయినా శంకరుని లీలా విశేష పరీక్షలకు బద్ధులే.

12/03/2016 - 20:56

అంత అక్కడ శనైశ్చరుడు కాశీ నగరానికి వెడలి, లింగ ప్రతిష్ఠ కావించాడు. ఆ శనైశ్చరేశ్వరుడు విశే్వశ్వర దేవుడికి దక్షణం వైపున శుక్రేశ్వరుడికి ఉత్తరంగా ప్రతిష్ఠితుడయి సేవించు భక్తులకి భోగం మోక్షం ప్రసాదిస్తాడు. శనైశ్చరుడికి ఈ లోకం శనైశ్చరేశ్వర లింగం ప్రసాదం. ఇది శనైశ్చర లోక వృత్తాంతము.
సప్తర్షి లోక వృత్తాంతం

Pages