S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 17:33

శ్రీనగర్‌ : రంజాన్ నెల కావడంతో శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత వేర్పాటు వాద గ్రూపులకు చెందినవారు పాకిస్తాన్ పతాకాలు, ఐసీస్‌ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.

06/17/2016 - 17:22

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల్లో కదలిక వచ్చి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

06/17/2016 - 16:40

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గుతోందని, ముఖ్యంగా సంపన్నవర్గాల వారు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ చిన్నారులకు పౌష్టికాహారం అనే అంశంపై జరిగిన సభలో మాట్లాడారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు అమృతహస్తం పథకాన్ని తాము గతంలోనే ప్రారంభించామన్నారు. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అన్ని వర్గాల వారూ దృష్టిసారించాలన్నారు.

06/17/2016 - 16:39

హైదరాబాద్: సరకు రవాణా, ప్రచారం, టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ సూచించారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపాలన్నారు. ఆర్టీసీ బస్సులు, కాంప్లెక్సుల ద్వారా ప్రకటనలు ఇచ్చే సంస్థలను ఆకట్టుకోవాలని, సరకు రవాణాను పెంచాలని అన్నారు.

06/17/2016 - 16:38

విజయవాడ: వడ్డీతో కలిపి పదికోట్ల రూపాయల బకాయిలను ఏళ్లతరబడి చెల్లించక పోవడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబి) అధికారులు కంచికిచర్లలోని హాలిడే ఇన్ రెస్టారెంట్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి 2006లో మూడు కోట్ల రూపాయల రుణాన్ని ఐఓబి ఇచ్చింది. వడ్డీతో కలిపి బకాయిల మొత్తం పది కోట్లకు మించడంతో చివరకు రెస్టారెంటును స్వాధీనం చేసుకున్నారు.

06/17/2016 - 16:38

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో కంటోనె్మంట్ ఏరియాలో నిర్మించిన ఆస్పత్రిని కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయ శుక్రవారం ప్రారంభించారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్, ఎంపీలు విశే్వశ్వర రెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

06/17/2016 - 16:37

హైదరాబాద్: ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్‌టిఎ) అధికారులు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వంద వాహనాలను సీజ్ చేశారు. 16 ప్రైవేటు బస్సులు, 10 స్కూల్ బస్సులతో పాటు బైక్‌లు, కార్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

06/17/2016 - 16:37

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ ప్రాంతంలో తరచూ రోడ్లను మూసివేస్తున్నందున స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై శాశ్వత పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చేశారు. కంటోనె్మంట్‌లో ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పారికర్ పాల్గొన్న సందర్భంగా మల్లారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

06/17/2016 - 16:36

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌ను సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఫిల్మ్‌నగర్ ఆలయంలో ఈ నెల 18 నుంచి అయిదురోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొనవలసిందిగా సిఎంను ఆయన ఆహ్వానించారు.

06/17/2016 - 16:36

ఒంగోలు: రెండు కుటుంబాల మధ్య స్థల వివాదం ఘర్షణగా మారడంతో 9 మంది గాయపడిన సంఘటన బల్లికురవ మండలం వల్లపల్లిలో శుక్రవారం జరిగింది. రెండు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అద్దంకి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

Pages