S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/08/2018 - 02:32

దుబాయి, జూన్ 7: భారత్‌కు చెందిన ఒక రైతు షార్జాలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. కేరళకు చెందిన సుధీర్ గురువాయార్ 4,914 కరివేపాకు మొక్కలను పంపిణీ చేసి గతంలో గురునానక్ దర్బార్ గురుద్వార్ అనే వ్యక్తి మూడు రకాల మొక్కలు 2083 పంపిణీ చేసి మార్చిలో నెలకొల్పిన రికార్డును బద్ధలు చేసినట్టు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.

06/07/2018 - 03:32

లక్నో, జూన్ 6: దేశంలో ఏకకాలంలో ఎన్నికలకు తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. లోక్‌సభ, అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే తాము స్వాగతిస్తామని బుధవారం ఇక్కడ వెల్లడించారు. యూపీ రాజధాని లక్నోలో అఖిలేష్ మీడియాతోమాట్లాడుతూ ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలకు మేం రెడీ’ అని స్పష్టం చేశారు. ‘ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

06/07/2018 - 03:31

లండన్, జూన్ 6: ప్రపంచ శాంతి సూచికల్లో భారత్ 137వ స్థానంలో నిలిచింది. సిడ్నీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ప్రపంచ శాంతి సూచికలను ఖరారు చేసింది. ఇందులో 163 దేశాలు పాల్గొన్నాయి. నిఘా, శాంతి భద్రతల పరిరక్షణ విభాగాన్ని పటిష్టం చేయడం, చట్టాలను అమలు చేయడం వల్ల హింసాత్మక ఘటనలు భారత్‌లో గణనీయంగా తగ్గాయని ఈ సంస్థ పేర్కొంది.

06/07/2018 - 03:27

జమ్మూ, జూన్ 6: జమ్మూలోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా పూర్తిస్థాయిలో జవాన్లను మోహరించి అప్రమత్తంగా ఉండాలని బిఎస్‌ఎఫ్ నిర్ణయించింది. ఇటీవల జమ్మూ, సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సెక్టార్ కమాండర్ స్థాయి సమావేశం అనంతరం ఒక సీనియర్ అధికారి బుధవారం వివరాలను వెల్లడించారు.

06/07/2018 - 03:25

లక్నో, జూన్ 6: యూపీలోని కొన్ని దేవాలయాలు, స్టేషన్లను పేల్చివేస్తామని లష్కర్ తొయిబా పేరిట బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. మధురలోని కృష్ణజన్మభూమి దేవాలయం, వారణాసిలోని కాశీవిశ్వనాథుని ఆలయాన్ని పేల్చివేస్తామని, అలాగే సహర్నపూర్, హాపూర్ రైల్వేస్టేషన్‌లను పేల్చివేస్తామని లష్కర్- ఎ-తొయిబా పేరిట ఫిరోజ్‌పూర్‌లోని రైల్వే డిఆర్‌ఎం గత నెల 29న ఒక లేఖ అందింది.

06/07/2018 - 04:42

మండసర్ (ఎంపీ), జూన్ 6: తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు పడుతున్న బాధల నుంచి తాము విముక్తి కల్పిస్తామని ఆయన అన్నారు.

06/05/2018 - 03:40

శ్రీనగర్, జూన్ 4: కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియా జిల్లాల్లో సోమవారం మిలిటెంట్ల రెండు గ్రెనేడ్ దాడుల్లో 8మంది భద్రతా సిబ్బంది సహా 23మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఈ రకమైన దాడులు తీవ్రమైన నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. మొదటి దాడి షోపియా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది పౌరులు, 4 పోలీసులు గాయపడ్డారు.

06/05/2018 - 04:12

ఇస్లామాబాద్, జూన్ 4: పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఎన్నికల ముందే కష్టాలు మొదలయ్యాయి. జూలైలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇమ్రాన్ నిజాయితీ, సత్‌ప్రవర్తన లేని నాయకుడని ఆయన మాజీ భార్య రెహామ్‌ఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2015లో ఖాన్‌కు రెహామ్‌కు వివాహమైంది. పది నెలల కాపురం తరువాత రెహామ్‌కు విడాకులిచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే బుష్రా మనేకాను వివాహమాడాడు.

06/05/2018 - 04:13

గ్వాటెమాలా సిటీ, జూన్ 4: ఆదివారం ఫ్యూగో అగ్నిపర్వతం పేలిన సంఘటనలో కనీసం 25 మంది ప్రజలు మరణించారు. పేలిన అగ్నిపర్వతం నుంచి పెద్దఎత్తున వెలువడుతున్న బూడిద, రాళ్ల కారణంగా, గ్వాటెమాలా విమానాశ్రయాన్ని మూసివేశారు. తగిన వెలుతురు లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో మరణించినవారి ఆచూకీ కోసం చేస్తున్న యత్నాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

06/04/2018 - 02:10

బీజింగ్, జూన్ 3: చైనా సరకులపై టారిఫ్‌ను విధిస్తే భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలకు స్వస్తి చెబుతామని చైనా అమెరికాను హెచ్చరించింది. చైనా, అమెరికా వాణిజ్య బృందాల మధ్య బీజింగ్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపొందించుకోవడంపై సమావేశం జరిగింది. చైనా ఉప ప్రధానమంత్రి లీ హీ, అమెరికా వాణిజ్య మంత్రి విల్బుర్ రోస్ పాల్గొన్నారు. చర్చలు అనంతరం ఉభయ దేశాలు ప్రకటన విడుదల చేశాయి.

Pages