S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/04/2018 - 02:03

దుబాయ్, జూన్ 3: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహిస్తున్న లాటరీలో మరో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. నైజీరీయాలో నివసించే డిక్సన్ కట్ట్థిర అబ్రహాం అబూదాబీలో లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఆ టిక్కెట్‌కు 10 మిలియన్ దిర్హామ్‌ల ప్రైజ్ మనీ దక్కింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.18,22,25,000లకు సమానం కాగా, అమెరికా డాలర్లలో 27,22,450.

06/04/2018 - 01:23

జుబుల్‌జనా, జూన్ 3: మధ్య ఐరోపా దేశమైన స్లొవేనియాలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. నిజానికి జూన్ 10న దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ గత మార్చిలో సెంట్రల్-లెఫ్ప్ పార్టీకి చెందిన ప్రధాన మిరో సిరార్ రాజీనామా చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 3నే ఎన్నికలు నిర్వహించారు.

06/03/2018 - 02:54

లండన్, జూన్ 2: బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ హెల్త్ సర్వీసుకు డాక్టర్ల కొరత తలెత్తింది. దీంతో దేశంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే భారత్ డాక్టర్లను అనుమతించాలని, కఠిమమైన వీసా నిబంధనలను సడలించాలని బ్రిటన్ దేశ వైద్య సంఘాలతో పాటు బ్రిటన్‌లో పనిచేస్తున్న భారత్ సంతతికి చెందిన వైద్యులు ప్రభుత్వంపై వత్తిడి పెంచారు.

06/03/2018 - 03:19

సింగపూర్, జూన్ 2: మూడు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ముగించుకుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మూడు రోజుల్లో ఆయన ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు. చివరి రోజు శనివారం ఆయన సింగపూర్‌లో హిందూ, బౌద్ధ ఆలయాలను, మసీదును సందర్శించడం విశేషం. ఈ పర్యటన జయప్రదమైనట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

06/02/2018 - 03:49

సియోల్, జూన్ 1: ఈ నెలలో మిలిటరీ, రెడ్‌క్రాస్ చర్చలు జరపాలని ఉభయ కొరియాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడానికి, 1950-53 యుద్ధంలో విడిపోయిన కుటుంబాలను మళ్లీ కలపడానికి వీలుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సరిహద్దు గ్రామమైన పాన్‌మున్‌జామ్‌లో ఇరు దేశా సీనియర్ అధికార్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.

06/02/2018 - 01:04

సింగపూర్, జూన్ 1: ధనిక, పేద వైరుధ్యాలను తొలగించేందుకు టెక్నాలజీ ఆధారిత సామాజిక నిర్మాణం ఎంతైనా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈరకమైన పరిణామాల కారణంగా ఏర్పడే కొన్ని ఇబ్బందులను విధ్వంసపూరితమైనవిగా, అనాలోచితమైనవిగా పరిగణించడానికి ఎంతమాత్రం వీల్లేదని స్పష్టం చేశారు.

06/02/2018 - 01:02

సింగపూర్, జూన్ 1: నౌకాదళ సంబంధాలతోపాటు ఆర్ధిక, రక్షణపరంగా మరింత చేరువవ్వాలన్న లక్ష్యంతో భారత్-సింగపూర్‌ల మధ్య శుక్రవారం 8 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ లూంగ్‌ల మధ్య జరిగిన విస్తృత చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి.

06/01/2018 - 02:05

న్యూయార్క్, మే 31: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని మరో ముగ్గురు భారతీయ మూలాలు కలిగిన బిలియనీర్లు, బిల్ అండ్ మిలిందా గేట్స్, వారెన్ బఫెట్స్ నెలకొల్పిన దాతృత్వ సంఘం ‘గివింగ్ ప్లెడ్జ్’లో చేరారు. వీరు తమ ఆస్తుల్లో సగానికి పైగా సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు ప్రకటించారు.

06/01/2018 - 02:04

ఇస్లామాబాద్, మే 31: పాక్ మిలిటరీ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డును బ్లాక్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం దేశీయాంగ శాఖను ఆదేశించింది. ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. రాజద్రోహం కేసులో నిందితుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్తాన్‌కు వచ్చేందుకు, కొన్ని సదుపాయాలు పొందడంపై ఆంక్షలు విధించారు.

06/01/2018 - 01:58

ఇస్లామాబాద్, మే 31: భారత్ నియంత్రణ రేఖవద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ ప్రజలకు తమ మద్దతు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేసింది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ గురువారం మాట్లాడుతూ, వ్యతిరేకతను మానుకొని, పాక్‌తో ఏవిధమైన షరతులు లేకుండా చర్చలు జరపడమే భారత్‌కు ఉత్తమ మార్గమన్నారు.

Pages