S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 01:01

కాచిగూడ, మే 17: ప్రముఖ సాహితీవేత్త పోతుకూచి సాంబశివరావు రచించిన ‘ ఉదయ కిరణాలు’ నవల సమాలోచన కార్యక్రమం విశ్వసాహితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు.

05/18/2016 - 01:00

హైదరాబాద్, మే 17: జంటనగరాల ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి, పౌరసేవల నిర్వహణ వంటి అంశాలే గాక, ఉద్యోగాల కోసం అనే్వషిస్తున్న నిరుద్యోగులకు సైతం చేయూతనివ్వటంలో జిహెచ్‌ఎంసి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కొంతకాలంగా జోన్ల వారీగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ అర్హత కల్గిన నిరుద్యోగులను, ఉద్యోగులు అవవసరమైన కార్పొరేట్ సంస్థలను ఒక వేదికపైకి తీసుకువస్తున్నాయి.

05/18/2016 - 01:00

సికింద్రాబాద్, మే 17: అభివృద్ధి సాధనకోసం శ్రమించే సమయంలో అందుబాటులో ఉన్న వనరుల పరిధిలోనే ఉత్పాదకత పెంచడానికి సాంకేతికపై ఎక్కువగా ఆధారపడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ 151వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలోప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని నిర్వహించారు.

05/18/2016 - 00:59

ఇబ్రహీంపట్నం, మే 17: ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతాంగానికి మేలుచేసే విధంగా నడుచుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ వైస్ చైర్మన్ దండేటికార్ రవితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు.

05/18/2016 - 00:58

వనస్థలిపురం, మే 17: ప్రజల అభిప్రాయం మేరకు తూర్పు రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయాలని, లేకుంటే ఉద్యమం చేస్తామని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా జెఎసి ఆధ్వర్యంలో మలక్‌పేట, మహేశ్వరం, ఉప్పల్, ఎల్‌బినగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలతో తూర్పు రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయాలని అన్నారు.

05/18/2016 - 00:57

హయత్‌నగర్, మే 17: హయత్‌నగర్ మండలంలోని అన్ని చెరువులను మిషన్ కాకతీయ రెండవ దశలో భాగంగా రూ. 2.7 కోట్లతో పూడికతీత పనులు చేపట్టినట్టు ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.

05/18/2016 - 00:57

ధారూర్, మే 17: ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, రెవెన్యూ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓఝా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్ర్తి శక్తి భవన్‌లో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు పునః ప్రారంభయ్యే నాటికి విద్యార్థులకు కావలసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో ఇవ్వాలన్నారు.

05/18/2016 - 00:56

ఖైరతాబాద్, మే 17: వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తే పుట్టగతులు లేకుండా చేస్తామని మాలమహానాడు హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును ఎండగట్టారు. దళితున్ని సిఎం చేస్తానన్న కెసిఆర్ ఆ పదవిని అనుభవిస్తూనే మాల, మాదిగ మధ్య అగ్గి రాజేస్తున్నారని దుయ్యబట్టారు.

05/18/2016 - 00:56

ఘట్‌కేసర్, మే 17: జీవిత బీమా పేరుతో పేదప్రజల నుండి కోటిన్నర రూపాయలు వసూలుచేసి ఓ సంస్థ బిచాణా ఎత్తేసిన సంఘటన ఘట్‌కేసర్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితులు సంస్థ ప్రతినిధి ఇంటిముందు ఆందోళనకు దిగారు. మండల పరిధి అవుషాపూర్ గ్రామంలోని పేదప్రజలను నమ్మించి పిఎసిఎల్ లిమిటెడ్ అనే బీమా సంస్థలో అదేగ్రామానికి చెందిన ప్రతినిధి డబ్బులు కట్టించాడు. నెలకు రూ.

05/18/2016 - 00:55

షాబాద్, మే 17: రెండు బైకులు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన సోమవారం అర్ధరాత్రి మల్లారెడ్డి గూడ స్టేజి దగ్గర చోటు చేసుకుంది.

Pages