S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 00:23

మంచిర్యాల, మే 17: ఈ నెల 13,14,15 తేదీల్లో హర్యాణా రాష్ట్రంలోని సిర్సా భగత్‌సింగ్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచారని కోచ్ మోహన్ రెడ్డి తెలిపారు. క్రీడా పోటీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలుచుకొని మంగళవారం జీటీ ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు చేరుకోగా క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు.

05/18/2016 - 00:22

ఆదిలాబాద్ టౌన్, బోథ్, మే 17: చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కుసుమా జిల్లా పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సిఆర్‌పిఎఫ్ బలగాలకు జరిగిన ఎదురుకాల్పులో బోథ్ మండలం మర్లపెల్లి గ్రామానికి చెందిన గొడిసెల సతీష్ గౌడ్ (23) మృతి చెందాడు.

05/18/2016 - 00:20

పటన్‌చెరు, మే 17 : ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుకనుండి కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా, క్లీనర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.

05/18/2016 - 00:19

వెల్దుర్తి, మే 17: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వెలుగులు వస్తాయనుకున్న తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి చీకటి పాలన సాగిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్లేశం అన్నారు. భూ నిర్వాసితుల కోసం సాగిస్తున్న పాదయాత్ర వెల్దుర్తి మండలానికి చేరుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాలు, భూములు, వెలుగులు వస్తాయనుకున్న ప్రజలను ఈ ప్రభుత్వ పట్టపగలే దోచుకు తింటుందన్నారు.

05/18/2016 - 00:19

సిద్దిపేట, మే 17 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులకు సీమాంధ్ర పార్టీల నేతలు అడ్డుపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వుంటుందని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు హెచ్చరించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో మన వాటాలో ప్రాజెక్టులు నిర్మించుకుంటామన్నారు.

05/18/2016 - 00:18

జోగిపేట, మే 17: మిషన్ కాకతీయ పనుల ద్వారా రైతులు అభివృద్ధి చెందుతారని అందోల్ ఎమ్మెల్యే పి.బాబుమోహన్ అన్నారు. మంగళవారం అందోల్ మండల పరిధిలోని అన్నసాగరం గ్రామంలో రెండవ విడత మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ మనుసాన్‌పల్లి, డాకూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో కూడా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

05/18/2016 - 00:18

సంగారెడ్డి టౌన్, మే 17: జిల్లాలో ఈ నెల 22న నిర్వహించే టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో టెట్ పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.

05/18/2016 - 00:17

సంగారెడ్డి టౌన్, మే 17: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణలకై యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌పి సింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమీషనర్ అనితారామచంద్రన్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

05/18/2016 - 00:17

తొగుట, మే 17: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగవని.. భూసేకరణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ రోనాల్‌రాస్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండలంలోని ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఏటిగడ్డకిష్టాపూర్‌ను జెసి వెంకట్‌రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డిలతో కలిసి ప్రజలతో సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం శాటిలైట్ ద్వారా సర్వే చేశాకే వాటి డిజైన్ తయారు చేస్తారన్నారు.

05/18/2016 - 00:16

గజ్వేల్ మే 17: గజ్వేల్ మున్సిపల్ పరిదిలో ప్రజ్ఞాపూర్ రాజీవ్హ్రదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూర్‌కు చెందిన మల్లయ్య(55), బాల్‌రాజ్ (38), రవీందర్(37)లతోపాటూ మరో ఇద్దరు ఆటోలో మెదక్ జిల్లా వర్గల్‌కు బయలుదేరారు.

Pages