Karimnagar

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్

Hide this category: 
Show

ఎనీ టైం నో మనీ

కరీంనగర్ టౌన్: నగరానికి చెందిన రఘునందన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, చికిత్స కోసం అవసరమైన డబ్బును ఎటిఎంలో నుంచి తీసుకునేందుకు వెళ్ళాడు. మంకమ్మతోటలోని ఓ సెంటర్‌కు వెళ్ళగా నగదు లేదంటూ బోర్డు దర్శనమివ్వటంతో వెనుదిరిగాడు. అక్కడినుంచి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలో గల మరో ఎటిఎం కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. పక్కనే ఉన్న ఇంకో కేంద్రంలో ఉండచ్చేమోననే ఆశతోఅందులోకి వెళ్ళాడు. గబ గబా..తన డెబిట్ కార్డు తీసి అప్లై చేశాడు. కంప్యూటర్ తెరపై నోక్యాష్ ఇన్ దిస్ ఎటిఎం అనే వాక్యం రావటంతోనిరాశతో వెనుదిరిగాడు.

జానపద కళారూపాలను భావితరాలకు అందించాలి

కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉండే వివిధ జానపద కళారూపాలను పరిరక్షించి భావి తరాలకు అందించే బాధ్యత మనపై ఉందని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక కళాభారతిలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జానపద జాతర కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న కళారూపాలు కనుమరుగైనాయని, జానపద కళలు తెలంగాణ ప్రజల హృదయాలను కదిలిస్తాయని తెలిపారు.

హిందూ పండుగలపై వివక్ష ఎందుకు..?

కరీంనగర్ టౌన్, ఆగస్టు 22: రంజాన్ పండుగకు నెలరోజుల పాటు భారీ ఏర్పాట్లు, క్రిస్‌మస్ పండగకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ అంగరంగవైభవంగా నిర్వహించే యంత్రాంగం హిందూ పండుగలపై ఎందుకు వివక్ష కనబర్చటం వెనుక ఆంతర్యమేంటంటూ భారతీయ జనతాపార్టీ నగరశాఖ ఆధ్వర్యంలోమంగళవారం బల్దియా ఎదుట భారీ ఆందోళన చేపట్టింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక నవరాత్రోత్సవాలు మరో మూడు రోజుల్లో ప్రారంభమవుతుండగా, ఇప్పటికీ నగరంలో కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై కార్యకర్తలు కదం తొక్కారు. వందలాది మంది భారీ ర్యాలీగా తరలివచ్చి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు

సిరిసిల్ల, ఆగస్టు 22: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య విధానంలో విప్లవాత్మక మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణలో అంతర్భాగంగా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి అన్నా రు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి

పెద్దపల్లి, ఆగస్టు 22: హరితహారంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్పరెన్స్‌లో హరిత హారంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈకార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రజలను భాగస్వామ్యం చేసి హరిత హారాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ఇంట్లో ఎంత మంది సభ్యులు నివాసం ఉంటే అన్ని మొక్కలు వారి పేరు మీద నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కాళేశ్వరం కట్టాల్సిందే...

కరీంనగర్, ఆగస్టు 22: జీవకోటికి నీరే జీవనాధారం. బీడు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిందే. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులు వెంటనే ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలి. దీనిని ఎవరూ అడ్డుకున్న ప్రజలు ఊరుకోరు అంటూ మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అయితే, గులాబీ నీడన ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగిందంటూ సిపిఐ, సిపిఎం, దాని అనుబంధ సంఘాలు, రైతు సంఘాల నాయకులు పలువురు తమ నిరసన రూపంలో కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి

కరీంనగర్ టౌన్: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట లైసెన్స్ సర్వేయర్లను ఉపయోగించుకొని సర్వే పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్ ఖానం, ఆర్‌డిఓలు రాజాగౌడ్, చెన్నయ్య, ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘డివైసి’కి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత

కరీంనగర్: ప్రతీ సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమానికి ప్రజలు తెలిపే సమస్యలకు జిల్లా అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో కలిసి జెసి డివైసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేకపోయిన వారికోసం ప్రతీ సోమవారం ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు నిర్వహిస్తూ ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

పోలీసుల నిర్బంధ తనిఖీలు

కరీంనగర్: కరీంనగర్ నగర శివారు చింతకుంట గ్రామంలో పోలీసులు సోమవారం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. చింతకుంటలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో వేకువజామునుంచి ఉదయం 8 గంటల వరకు ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన దృవపత్రాలు లేని 25 ఆటోలు, 20 ద్విచక్ర వాహనాలు, 25 కిలోల పిడిఎస్ బియ్యం, ఐదు వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఎసిపి ఎ.తిరుపతి మాట్లాడుతూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీల ద్వారా పలు అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఓసిల సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్ టౌన్: విద్య, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో వెనుకబడిన ఓసిలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ ఒసి సంక్షేమ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాసిన బహిరంగ లేఖను ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒసి సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది ముందుండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నారని, కొత్త రాష్ట్రంలో ఒసిల సమస్యలు తీరుతాయని భావిస్తే అవి కళలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Pages