Karimnagar

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్

Hide this category: 
Show

అడుగులువేయాలి

కరీంనగర్, మార్చి 14: హరిత తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో అడుగులు వేయాలని హరితహారంలో విరివిగా మొక్కలు నాటి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎత్తులు.. పై ఎత్తులు!

కరీంనగర్, మార్చి 13: పట్ట్భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోరు ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోజోరందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎవరి యత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు, ప్రధాన పార్టీల మద్ధతుతో బరిలోకి దిగిన వారంతా సొంత ఏజెండా, వ్యక్తిగత మేనిఫెస్టోలు ప్రకటిస్తూ గెలుపుకోసం తండ్లాడుతున్నారు. రెండు వేర్వేరు స్థానాలకు జరుగుతున్న పోటీలో ఉపాధ్యాయ స్థానంపై అంతగా దృష్టి సారించలేకపోతుండగా, పట్ట్భద్రుల స్థానం మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది.

శీఘ్రంగా.. రాజన్న దర్శనం

వేములవాడ, మార్చి 1 : భక్తుల పాలిట దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానం లో మార్చి మూడో తేది నుంచి మహా శివరాత్రి జాతర ప్రారంభం కానున్నది. వేడుకలకు వచ్చే భక్తులందరికి శీఘ్రంగా..సంతృప్తికరంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించడం లక్ష్యంగా చేసుకున్నట్లు అలయ ఈ,వోదూస రాజేశ్వర్ తెలిపారు. మూడురోజులపాటు జరిగే జాతర ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.జాతర ఏర్పాట్ల గురించి ఇవో రాజేశ్వర్‌తో ఆంధ్రభూమి ముఖాముఖి నిర్వహించింది.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

పెద్దపల్లి, ఫిబ్రవరి 15: కాశ్మీర్‌లోని అవంతిపుర రహదారిలో భారత సైనికులపై ఉగ్రదాడిని నిరసిస్తూ జవాన్లమృతికి కారణమైన ఉగ్రవాదుల దిష్టిబొమ్మను విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కమాన్‌కూడలిలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాశ్మీర్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు ఆత్మశాంతి కలగాలని వేడుకున్నారు.

శిరస్త్రాణం..శిరోధార్యం

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 1: హెల్మెట్..హెల్మెట్. నగరంలోని ఏ ద్విచక్రవాహనదారుని నోట విన్నా ఇదే మాట. శుక్రవారం నుంచి నగరంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ చట్టం అమలుకు శ్రీకారం చుట్టగా, ద్విచక్రవాహనదారులు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. తలకు శిరస్త్రాణం లేకుంటే భారీగానే జరిమానాలు విధిస్తూ, నేరుగా వారి ఇళ్ళకే ఈ చలాన్‌లు పంపే ప్రక్రియను పోలీసులు అంకురార్పణ చేశారు. దీంతోటూవీలర్లంతా హెల్మెట్‌ల బాట పట్టారు.

గులాబీ ప్రభంజనమే

కరీంనగర్, జనవరి 25: పంచాయతీ ఎన్నికల రెండోదఫా పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 18 మండలాల్లోని 337 పంచాయతీలు, 2,692 వార్డులకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,848 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా రెండో దఫా పల్లె పోరులో గులాబీ ప్రభంజనమే సాగింది. ఉమ్మడి జిల్లాలోని 18 మండలాల్లో 52గ్రామ పంచాయతీలు, 956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్,జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 5,52,213 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 2,17,891 మంది, పురుషులు 2,51,813 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గోదా కల్యాణానికి సిద్ధమైన ధర్మపురి

ధర్మపురి, జనవరి 11: ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై గోదా రంగనాథ స్వాముల కళ్యాణం ఈనెల 13న ఆదివారం ఉదయం 11గంటల సుముహూర్తంలో నిర్వహించనున్నందున దేవస్థానం పక్షాన విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. వటపత్రశాయి అయిన శ్రీమహా విష్ణువును గూర్చి రోజుకొక్క పాశురం గానం చేసి, శ్రీనివాసునికై కాత్యాయనీ వ్రతమాచరించి, శ్రీరంగ నాథుడిని పరిణయ మాడిన ఆండాళ్ కోదై, గోదాదేవి, ఆముక్త మాల్యద, చోడిక్కొడుత్త నాచ్చియార్ అనే పేర్లతో ప్రసిద్ధ నొందినది. మధురకు యాభై మైళ్ళ దూరాన శ్రీవిల్లిపుత్తరు అనే చిన్ని నగరంలో నిత్యం, రంగానాథుడిని సేవించే విష్ణుచిత్తుడనే పరమ భక్తుడుండేవాడు.

బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి

కరీంనగర్, జనవరి 2: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంక్షించారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా మంగళవారం కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్‌కువచ్చి బస చేయగా, బుధవారం ఉదయం కలిసేందుకువచ్చిన వీఐపీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చాలు అందించారు. రెండో విడుత ఎన్నికల అనంతరం మొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లాలోని అన్నిప్రభుత్వ విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా (కలిశారు. అలాగే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మేడిగడ్డ, కనె్నపల్లిని సందర్శించిన సీఎం

కరీంనగర్, జనవరి 1:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సందర్శించి సాయంత్రం 6గంటలకు కరీంనగర్ తీగెల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకు చేరుకొని పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కనె్నపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకొని అక్కడ పనులు పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. సాయంత్రం 6గంటలకు హెలికాప్టర్ ద్వారా నగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

Pages