డైలీ సీరియల్

మాలిక్ కాఫర్ - 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా శరభాంకారాధ్యుడు, మల్లికార్జున పండితుడు ఇత్యాది పాలకుర్తి సూరనాధ్యుడు, శివగణము ఐదువేలమంది, విష్ణ్భుక్తులైన ఆచార్య స్వాములు మూడు వందలమంది, శాక్తేయులు, గాణాపత్యులు, క్షేత్రపాలకులు నాలుగువేల మూడు వందలమంది వీరందరితోను నిండు పేరోలగము కిటకిటలాడుతుండగా ముందు వేదస్వస్తి జరిగింది. తర్వాత కవితా గోష్ఠి విద్యనాధ అగస్త్యుడు సంస్కృతంలో కవిత్వం చెప్పాడు.
ఓ ప్రతాపరుద్ర మహాప్రభూ! నీ కీర్తిని నేను ప్రశంసిస్తే తమకు శృంగభంగమైనట్లు పర్వతములు నాపై కోపిస్తున్నాయి. నీ గాంభీర్యమును ప్రశంసిస్తే సముద్రములు అవమానంతో (ఓటమిలో) చిన్నబుచ్చుకొని నాపై కోపిస్తున్నాయి. ఐనా నాకేమి భయం? నేను అగస్త్యుణ్ణి కదా! అంటే లోగడ అగస్త్యుడు వింధ్యపర్వతమునకు శృంగభంగం చేశారు. సముద్రము తాగివేశాడు. కాబట్టి ఈ పర్వతముల కోపమూ సముద్రముల ఆగ్రహములు నన్ను ఏమీ చేయలేవు అని విద్యానాథ అగస్త్య పండితుని ప్రశంస. ఇది విని రసజ్ఞులైన కవి పండితులందరూ కరతాళధ్వనులు చేశారు.
‘‘ప్రతాపరుద్రుడు ఓరుగల్లును పాలించటం ప్రారంభించగానే తమోగుణం పారిపోయి చీకటిని ఆశ్రయించింది. నల్లధనం కోకిలను అంటుకొన్నది. పక్షపాతము దుర్గుణము- అది ధర్మము పక్కన చేరింది. (అంటే ప్రభువు ధర్మపక్షపాతి అని చమత్కారము) వక్రగతి రాజ్యం నుండి పారిపోయి స్ర్తిల ముంగురుల్లో దాక్కున్నది. చంచలత్వం స్ర్తిలనేత్రాశ్రయము పొందింది. (అంటే స్ర్తిలు చంచలాక్షులు, ప్రభువు సుస్థిరుడు అని తాత్పర్యం)
‘‘ప్రతాపరుద్రుడు భూమండలమును పాలిస్తుంటే రాజ్యంలో పశుగ్రాసానికి కరవు ఏర్పడింది. కారణమేమిటా అని విచారిస్తే ఆ గడ్డి మొత్తం శత్రువులు మేసినట్లు తెలిసింది.
ప్రతాపుడు ఓరుగల్లును పాలిస్తుంటే ఆయన కీర్తిలోని తెల్లదనం వలన ఏనుగులన్నీ తెల్లబడ్డాయి. ఫలితంగా దేవేంద్రునికి తన ఐరావతాన్ని గుర్తించటం సమస్యగా మారింది.
ప్రతాపుడు రాజ్యాన్ని పాలిస్తుంటే దాతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. సువర్ణ, గోదానములు చేయాలని దాతలు ఉవ్విళ్లూరినా తీసుకునేందుకు ఎవరూ రావటంలేదు. కారణం దరిద్రులు లేకపోవటమే. ఇచ్చేవాడే తప్ప పుచ్చుకొనేవాడే లేడు.
ప్రతాపుడు రాజ్యపాలన చేస్తున్న సంగతి తెలిసి ఈర్ష్యతో చంద్రుడు ముఖానికి మసిపూసుకున్నాడు. అదే ఆయనపై మచ్చగా మారింది.
ఈ ప్రభువు సర్వజ్ఞుడని అంతా ప్రశంసిస్తున్నారు. అది నిజం కాదు. ఈయన చేయి పైనుండి కిందికి తెచ్చి వామనునివలె యాచించటం తెలియునా? తెలియదు. శత్రువులకు వీపుచూపటం తెలియునా? తెలియదు. పరస్ర్తిలకు హృదయమునివ్వటం తెలియునా? తెలియదు. శరణాగతులను శిక్షించటం తెలియునా? తెలియదు’’
ఇలా కవితా ప్రశంసలు నిందాస్తుతులు సాగాయి.
ఆ తరువాత సుదీర్ఘంగా కవి సమ్మేళనం జరిగింది. భరతనాట్య విశారద అంబాదేవి జాయప సేనాని నృత్తరత్నావళిని అభినయ రూపంలో సభకు అనువదించింది.
చిలుక పలుకుల త్రిపురారి కొద్దిసేపు తన చమత్కార సంభాషణలతో సభను రంజింపజేశాడు. ఆ తరువాత అశ్విక గజమహిష కుక్కుట మేష విన్యాసములు ప్రదర్శించారు. మల్లయుద్ధవీరులు తమ ప్రతిభను చాటారు.
ఆ తరువాత శివదేవ మహామంత్రి ఇలా అన్నాడు. ‘‘నేడు మన కాకతీయ జయకేతనము సమస్త దక్షిణాపథంలోనూ అప్రతిహతంగా రెపరెపలాడుతున్నది. ఈ ప్రతాపరుద్రుడు శివస్వరూపుడు. మహారాణి విశాలాక్షీదేవి సాక్షాత్తు కాశీ విశాలాక్షియే. ఇది భారతదేశ చరిత్రలోనే స్వర్ణయుగము. మన సామ్రాజ్యము సమస్త కళలకు కాణాచి. సర్వవేద శాస్తమ్రులకు పుట్టినిల్లు. నందీశ్వరునికి ఆటపట్టు
(సభలో కరతాళ ధ్వనులు. ఇక్కడ నందీశ్వర శబ్దము నందికేశుని నాట్య శాస్తమ్రును స్ఫురింపజేస్తున్నది. కాబట్టి నంది- ఆటపట్టు అనే శబ్దములలో చమత్కారం గురువుగారి నోట అప్రయత్నంగా ద్వ్యర్థిగా వచ్చింది)
అవిచ్ఛిన్న భారతీయ ధార్మిక పరంపరను రక్షించటం కోసం ఈ సామ్రాజ్య స్థాపన జరిగింది. ప్రోలరాయ రుద్రదేవ మహాదేవ గణపతి దేవాదుల సంకల్పం. అదే పరంపరను కుమార ప్రతాపరుద్ర దేవుడు కొనసాగిస్తున్నాడు. సాటి రాజన్యులంటారు పవిత్ర ధార్మిక యజ్ఞములో హోతలుగా, ఉద్గాతలుగా, ఋత్విక్కులుగా, ఉపద్రష్టలుగా యాజకులుగా కాకతీయ సామ్రాజ్యానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది శివాజ్ఞ. రాజభక్తి దేశభక్తి ధర్మనిష్టంగా మార్చండి. మనమే అందరికీ ఆదర్శంగా నిలుద్దాం.
ఆ తర్వాత చాలా సంగ్రహంగా శివతత్వాన్ని ఉపదేశించాడు. నిరాకారమైన లింగరూపము సాకారమైన సాంబసదా శివరూపము విశ్వనర్తనకు సంకేతంగా నటరాజ రూపము నాద బిందు కళాత్మమైన శ్రీచక్రరూపము. ఇలా శివోపాసనా విధానములు ప్రయోజనము శివదేవయ్యగారు చెప్పారు. స్వర్ణమరకత కనక పుష్యరాగ స్ఫటికాది లింగముల ఉపాసనవల్ల సాధించే ఫలాలుకూడా ఆయన చెప్పారు. పాశుపత కాలాముఖ శ్రౌత, ద్రవిడ కాశ్మీర భేదములు సంగ్రహంగా వివరించారు.
కాకతీయులు మొదట గరుడలాంఛనులు, తర్వాత వరాహ లాంఛనులు. ఇక వారి నంది ధ్వజము ఆధ్యాత్మికము. నంది ఆనంద హేతువు. నాలుగు పాదములు చతుర్విధ పురుషార్థములు. ఇలా సాగింది గురుదేవ ప్రసంగము. తర్వాత శరభారాధ్యులు మల్లికార్జునుల వారు ఏకవాక్య ప్రసంగాలు చేశారు. ప్రతాపరుద్రుడు తాను మనసా వాచా కర్మణ ప్రజాసేవకు శివగురుదేవుల పాదసేవకు అంకితమైనట్లు ప్రకటించాడు.
నా పూర్వీకులైన సుమస్త రాజన్యుల పాదముద్రలు నాకు ఆదర్శం అన్నాడు. ఆ తర్వాత పేరిణి శివతాండవమును అరువది నలుగురు మహేశులు ఒకేసారి అభినయించారు. దానితో వాతావరణం ఉద్విగ్నభరితమైంది. వీర రస ప్రధానమైన ఈ నృత్యము చూపరులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
- ఇంకాఉంది