మిర్చిమసాలా

హస్తినలో తేల్చుకుంటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా రాజకీయ పక్షాల కన్నా భాజపాలో క్రమశిక్షణ కాస్త ఎక్కువంటారు. ఇటీవలి కాలంలో ‘కమలం’ పార్టీలోనూ కలతలు, కలహాలు తప్పడం లేదు. అయితే, మిగతా పార్టీల మాదిరి రోడ్డెక్కి రచ్చ చేసే అవకాశం ‘కాషాయ దండు’లో ఉండదు. అంతర్గత సమావేశాల్లో ‘అసలు విషయాలు’ మాట్లాడేందుకు యత్నించిన కొందరు ‘మూల్యం’ చెల్లించుకోవాల్సి వస్తోంది. విజయవాడలో తాజాగా జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ లక్ష్మీపతిరాజా ఏదో విషయం ప్రశ్నించగా- 24గంటలు గడవకముందే ఆయనపై వేటు పడింది. ప్రైవేటు టీవీ చానళ్ల సీఇవోలకు పార్టీ నుంచి లేఖలు వెళ్లాయి. రాజా తమ అధికార ప్రతినిధి కాదని, కనుక ఆయనను చర్చాగోష్టులకు పిలవరాదని అందులోని సారాంశం. ఈ ప్రతులు ప్రింట్ మీడియాకూ వెళ్లాయి. కాగా, తాను ఏనాడూ పార్టీ అధికార ప్రతినిధినని చెప్పుకోలేదని, దీనిపై ఢిల్లీలో అధిష్ఠానం వద్దనే తేల్చుకుంటానన్నారు రాజావారు.
- నిమ్మరాజు చలపతిరావు
జైళ్లలో జడ్జీలు!
తప్పు చేసిన వారు కోర్టులో చేతులు కట్టుకుని నిల్చుంటే న్యాయమూర్తులు శిక్షలు వేయడం సహజం. కొన్నిమార్లు ప్రముఖులే నిందితులైతే వారు బుర్ర దించుకుని శిక్షలు వినడం సినిమాల్లో మనం చూసేదే. కానీ, నిందితుల స్థానంలో న్యాయమూర్తులే నిల్చుని ఉంటే పరిస్థితి మరీ దారుణం. నిందితులైన న్యాయాధికారులకే కాదు, ఆ కేసులు విచారించే జడ్జీలకు, అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా తలవంపులు తెచ్చేదే. హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినపుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. గాలి జనార్దన రెడ్డి బెయిల్ కేసులో అప్పటి సిబిఐ జడ్జి టి.పట్ట్భా రామారావు, మరో జడ్జి లక్ష్మీనరసింహరావు,డి. ప్రభాకరరావులు అరెస్టు అయ్యారు. ఆమధ్య వినుకొండలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ జి సత్యవర ప్రసాద్, హైదరాబాద్ మూడో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్ జనార్దన రావులు లంచం కేసులో అరెస్టయి జైలు ఊచలు లెక్కపెట్టారు. పలమనేరులో ఎసిబి న్యాయమూర్తి శ్రీరాం సంజీవరావుఅవినీతి కేసులో అరెస్టు అయ్యారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లేబర్ కోర్టులో జుడిషియల్ ఆఫీసర్ ఎం గాంధీ అరెస్టు కాగా, జగిత్యాల అదనపుజూనియర్ సివిల్ జడ్జి మధు కూడా లంచం కేసులో అరెస్టయ్యారు. తాజాగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జీ రాధాకృష్ణమూర్తి అరెస్టు కావడం న్యాయాధికారుల్లో పెను సంచలనం రేపింది. నిందితులు మరో న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని నిల్చోవడంతో కోర్టు సిబ్బంది ఇబ్బంది పడకతప్పలేదు.
- బీవీ ప్రసాద్
భార్యల ముఖాలైనా చూడొద్దా?
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తెదేపా,వైకాపాలు అటు హస్తినలో, ఇటు ఆంధ్రలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ పోరుబాట పట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలూ పోరాటాన్ని ఉద్ధృతం చేశాయి. మోదీ క్యాబినెట్ నుంచి తెదేపా మంత్రులిద్దరూ రాజీనామా చేయగా, వైకాపా ఎంపీలు అయిదుగురూ లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు అందజేశారు. పార్టీ పరంగా నేతలందరితో కలసి బస్సుయాత్ర చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికి రూట్‌మ్యాప్ ఖరారు చేసేందుకు హస్తినలో ఉన్న పార్టీ ఎంపీలను అమరావతికి రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బస్సుయాత్ర గురించి మీడియా ప్రశ్నించగా, ‘రెండు నెలలుగా ఢిల్లీలోనే ఉన్నాం, ఇంటికి వెళ్ళి కనీసం మా భార్యల ముఖాలైనా చూసుకోవద్దా..?’ అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారి నవ్వారు.
-వి.ఈశ్వర్ రెడ్డి
మారిన కేసీఆర్..
దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేది ప్రజలే. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ‘గుణాత్మక మార్పులు’ రావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఆయన వైఖరిలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి వరకు వామపక్ష పార్టీలను, ఇతర పార్టీలను ఆమడదూరం పెట్టిన ఆయన ఇటీవల వివిధ పక్షాల వారితో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఆ భేటీకి సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు హాజరయ్యారు. వామపక్ష నేతలు తమకు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ కూడా వాపోయారు. సీపీఎం జాతీయ మహాసభలకు సౌకర్యాలు కల్పిస్తామని సీఎం ప్రకటించడంపై వామపక్ష వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ మార్పు వచ్చే ఎన్నికల దాకా ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే, ఎంతటి నేతలైనా దృఢ వైఖరిని సడలించుకుని ఉదారంగా వ్యవహరిస్తారు. అదే ప్రజాస్వామ్యం విశిష్టత.
- వెల్జాల చంద్రశేఖర్
కాదంటే ఔననిలే..
జాతీయ రాజకీయాలంటే ప్రాంతీయ పార్టీల్లోనూ మోజు పెరుగుతోంది. గతంలో జాతీయ రాజకీయాలంటే కాంగ్రెస్, భాజపాలకే పరిమితం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భావ సారూప్యత ఉన్న పార్టీల మధ్య భేటీలు, తేనీటి విందులు, ఇష్టాగోష్టి సమావేశాలు తరచుగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కోల్‌కతా వెళ్లి ‘తృణమూల్ పార్టీ’ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి వచ్చారు. అలాగే, కర్నాటక వెళ్లి పూర్వ ప్రధాని దేవెగౌడతో అనేక అంశాలపై చర్చించారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు లౌకికవాదం, భావ సారూప్య త పేరిట చిన్నా చితకా పార్టీలతో మంతనాలు సాగిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు మా త్రం తనకు జాతీయ రాజకీయాలంటే ఆసక్తి లేదని ప్రకటించారు. 1996లో కేంద్రంలో చక్రం తిప్పి, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చేలా చేసిన ఆయన జాతీయ రాజకీయాలకు దూరం అంటున్నారంటే- ‘అవకాశం వస్తే రెడీ’ అని అర్థమా?
- కేవీఎస్