రాష్ట్రీయం

ఆంధ్ర కంపెనీలకే అప్పనంగా పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్ర కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. పైగా అంచనాలు పెంచుకుంటూ కమీషన్లు దండుకుంటున్నారని ఆయన శుక్రవారం పార్టీ నాయకుడు ఎం. కోదండరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఆంధ్రా కంపెనీలకు, కాంట్రాక్టర్లకే పనులు దక్కుతున్నాయని తెలంగాణ ఉద్యమం సమయంలో విమర్శించిన టిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఆంధ్ర కంపెనీలకే పనులు దక్కేలా చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ దుయ్యబట్టారు. సుమారు లక్షా 35 వేల కోట్ల రూపాయల టెండర్లు వేస్తున్నారని, అందులో 6 శాతం కమీషన్లు తీసుకునేలా ఒప్పందాలు ఉన్నాయని, ఇవన్నీ ఒకటి రెండు కంపెనీలకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజాధనాన్ని పెద్దఎత్తున దోచుకుంటున్నదని ఆయన దుయ్యబట్టారు. ముందుగా టెండర్లలో పెద్ద ఎత్తున అంచనాలు పెంచి, ఆ తర్వాత కొద్దిశాతం తక్కువ టెండర్లు వేసి తక్కువ టెండర్లు వేసిన వారికే పనులు ఇస్తున్నామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఇంత పెద్దఎత్తున అక్రమాలు జరగడం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని విచ్చల విడిగా దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయంలో త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అక్రమాలను అడ్డకునేందుకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఆ తర్వాత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురుకు శిక్ష వేయడంపై తమ పార్టీ ఎప్పుడూ సమర్థించలేదని అన్నారు. దేశానికి ఎవరైనా వ్యతిరేకంగా పని చేస్తే వారిపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. బిజెపి జాతీయత, దేశ భక్తి అంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నదని ఆయన విమర్శించారు. విశ్వ విద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వం, బిజెపి, అనుబంధ విద్యార్థి విభాగం అనుసరిస్తున్న వైఖరి దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నదని అన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. జెఎన్‌యులో కన్నయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.