రాష్ట్రీయం

అటవీ చట్టాల్లో మార్పులు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 26: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అటవీ చట్టాల్లో మార్పులు అవసరమని ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంశాఖమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. చిత్తూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం జాతీయ సంపదని, దీని అక్రమ రవాణా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 80శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించామన్నారు.
అయితే అటవీ చట్టాల్లో కొన్ని లొసుగులు ఉండడంతో దీనిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలోనే ఈ అటవీ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా కార్యచరణ సిద్ధం చేసామన్నారు. రాష్ట్రంలో కూడా పోలీస్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్లు అవసరమని గుర్తించామని, ఇందుకోసం చిన్న స్టేషన్‌కు కోటి రూపాయలు, పెద్ద స్టేషన్‌కు రెండు కోట్లు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తుని ఘటన దురదృష్టకరమని ఈ సంఘటనపై సిఐడి విచారణ కొనసాగిస్తున్నారు.

త్వరలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ
పీలేరు: రాష్ట్రంలోని పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం పీలేరులో 2.66 కోట్లతో నిర్మించిన పోలీసు సిబ్బంది నివాస గృహాలను ఆయన ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన నివాస గృహాలను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. రానున్న బడ్జెట్‌లో పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.