ఆ అవకాశం కోసం చూస్తున్నా -హీరోయిన్ హెబ్బా పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారి 21 ఎఫ్‌తో టాలీవుడ్‌లో సంచలనం రేపి, యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది గ్లామర్ భామ హెబ్బాపటేల్. ఆ సినిమా తరువాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈమె రాజ్‌తరుణ్‌తో కలిసి నటించిన మరో చిత్రం ‘అంధగాడు’. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా హెబ్బా పటేల్‌తో ఇంటర్వ్యూ...
* సినిమా గురించి?
- వెలిగొండ శ్రీనివాస్ నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పినపుడు పాయింట్ బాగా నచ్చడంతో ఒప్పుకున్నా. ఇందులో నా పేరు నేత్ర. ఆప్టమాలజిస్ట్‌గా అంటే కళ్ల డాక్టర్‌గా కనిపిస్తాను. ఇందులో హీరోకు కంటిచూపు తేవడానికి ప్రయత్నిస్తాను. అతనివల్ల నా కెదురైన సమస్యలేమిటి అనేది చిత్రం.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నేను నార్మల్ అమ్మాయిగా నిజ జీవితానికి దగ్గరగా కనిపిస్తాను. నా గత చిత్రాల్లో కూడా నేను హైపర్‌గా నటించలేదు. చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయిని.
* రాజ్‌తరుణ్‌తో పనిచేయడం?
- రాజ్‌తో ఇది మూడో సినిమా. తనతో పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. ఇద్దరం పోటీపడి సన్నివేశాలు చేస్తాం. రాజ్ మంచి నటుడు. మొదట్లో నేను చూసిన రాజ్‌కు ఈ సినిమాలో రాజ్‌కు చాలా మార్పులు వచ్చాయి. ఓపికతోపాటు టాలెంట్ పెంచుకొన్నాడు. మొదట్లో కొంచెం హైపర్‌గా కనిపించేవాడు.
* మీ ఇద్దరిమధ్యా ఎఫైర్ ఉందంటూ వార్తలొస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు?
- ఈ విషయం గురించి నేనూ విన్నాను. ఇలాంటివి పెద్దగా పట్టించుకోము. నిజంగా అలాంటివి ఉంటే ఫీల్ అవ్వాలి. లేనప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదుగా.
* కొత్త దర్శకుడి గురించి?
- వెలిగొండ శ్రీనివాస్ రైటర్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు రాశాడు. ఆయన దర్శకుడిగా కూడా మంచి కమిట్‌మెంట్ వున్న వ్యక్తి. ఆయనను ఫాలో అవ్వడంవల్ల నా పని సులువైంది.
* హీరోయిన్‌గా ఇంకా స్టారడమ్
సంపాదించుకోకపోవడానికి కారణం?
- పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కానీ కొన్ని చేజారిపోతున్నాయి. అయినా నావరకు వచ్చిన సినిమాలతో నేను సంతోషంగా ఉన్నాను. తప్పకుండా ముందు ముందు అలాంటి అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్నా.
* హిట్ ఫ్లాప్‌లపై మీరు ఎలా స్పందిస్తారు?
- హిట్ ఫ్లాప్ అనేది పెద్దగా పట్టించుకోను. కానీ సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్‌గా వుంటుంది. ఎందుకంటే నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. ఎవరైనా హిట్ రావాలనే కోరుకుంటారు కదా!
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమా తరువాత రెండు నెలలు బ్రేక్ తీసుకుందామనుకుంటున్నాను. ఎందుకంటే, కుమారి 21ఎఫ్‌నుండి ఇప్పటివరకూ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నా. కాబట్టి రిలాక్స్‌కోసం ఈ గ్యాప్.

-శ్రీ