సామ్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ‘ఓ బేబీ’తో హిట్టుకొట్టిన సామ్ -మరోసారి అదే డైరెక్టర్‌తో మరో హిట్ కోసం సిద్ధమవుతుంది. సామ్ కోసం ఓ బేబీలో గెస్ట్‌రోల్‌తో మురిపించిన చైతూ -ఈ ప్రాజెక్టులోనూ కాస్త నిడివి ఎక్కువగా ఉండే అతిథి పాత్రలో కనిపించొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ రేంజ్‌ని ఎంజాయ్ చేసిన సామ్ -చైతూతో పెళ్లి తరువాతా ఆ రేంజ్‌ని కంటిన్యూ చేస్తూనే.. తనకొక హిస్టరీని క్రియేట్ చేసే పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. హిట్టు, ఫ్లాపులకు అతీతమైన హీరోయిన్‌గా తన టైం నడుస్తోంది కనుక -ప్రయోగాలపైనే ఆమె ఫోకస్ పెడుతోందని అంటున్నారు. గత ఏడాది ఫిక్షనల్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఓ బేబీతో వాహ్ అనిపించుకున్న సమంత, యూఎస్ బాక్సాఫీస్ వద్ద సోలో స్టామినా ప్రూవ్ చేసుకున్న హీరోయిన్‌గానూ రికార్డు సృష్టించింది. మళ్లీ అదే దర్శకురాలు నందినిరెడ్డితో -మరో ప్రయోగానికి సామ్ రెడీ అయ్యిందని అంటున్నారు. సెంటిమెంట్‌గా ఈ ప్రాజెక్టులోనూ చైతూతో కామియో చేయించడానికి స్క్రిప్ట్‌ని సానపెడుతున్నట్టు సమాచారం. హజ్బెండ్ గెస్ట్‌రోల్ సెంటిమెంట్ -కొత్త ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందేమో చూడాలి.