రాష్ట్రీయం

ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని సతీసమేతంగా ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో, పూర్ణకలశంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వామివారి విశిష్టతను తెలియజేయగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.శ్యామలాదేవి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు.
యోగా-వేదవిద్యల విలువలు పెంచండి!
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రధానమైన యోగా, వేద విద్యలకు సంబంధించి విలువలు పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం రాజాం జిఎంఆర్ ఐటి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలు గుర్తించాయని, దీన్ని బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఆయనతోపాటు పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో అనురాగ్ నిలయంతోపాటు రిమ్స్ వైద్య కళాశాలను కూడా గవర్నర్ సందర్శించారు.