రాష్ట్రీయం

పంచాయతీ అధికారిపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల సోదాలు
సుమారు రూ.2 కోట్ల ఆస్తుల గుర్తింపు
ఏలూరు, నవంబర్ 30 : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి ఎల్ శ్రీ్ధర్‌రెడ్డి, స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు సోదాలు ప్రారంభించారు. తెల్లవారుజామునుంచి ఏకకాలంలో దాడులు మొదలై, కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 11 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎసిబి డిఎస్‌పి కె రాజేంద్ర ఆధ్వర్యంలో మొత్తం తొమ్మిది బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో మూడు చోట్ల, తణుకులో ఒకచోట, కృష్ణాజిల్లా విజయవాడలోని ఆయన స్వగృహంపైనా, నెల్లూరులో శ్రీ్ధర్‌రెడ్డి స్నేహితుని ఇంటిపైనా, కడపలోరెండు చోట్ల, హైదరాబాద్‌లో ఒక చోట ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయనగరం, విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన ఎసిబి ఇన్‌స్పెక్టర్లు దాడుల్లో పాల్గొన్నారు. దాడుల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఇంత వరకు వెలుగు చూసినట్లు ఎసిబి డిఎస్‌పి కె రాజేంద్ర పేర్కొన్నారు. అయితే వీటి మార్కెట్ విలువ కనీసం ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల పైగానే ఉంటుందని భావిస్తున్నారు. పశ్చిమ జిల్లా కేంద్రం ఏలూరులో డిపిఒ శ్రీ్ధర్‌రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంట్లో, ఆర్‌ఆర్‌పేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో, జిల్లా పంచాయితీ కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తణుకులో రిటైర్డ్ పంచాయితీ కార్యదర్శి గోపాలరావు ఇళ్లలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. అలాగే విజయవాడలోని ఆయన సొంత ఇంటిలోనూ పరిశీలన జరుగుతుండగా కడపలో ఆయన మామ ఓబుల్‌రెడ్డి, రాయచోటిలో ఆయన తండ్రి కృష్ణారెడ్డి ఇళ్లపైనా ఈ దాడులు సాగుతున్నాయి. మంగళవారం డిపిఒ బ్యాంకు లాకర్లను కూడా తెరిచే అవకాశముందని తెలుస్తోంది.