రాష్ట్రీయం

నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ :జిల్లాలోని పిఏ మండలం వద్దికట్ల వద్ద ఏఎంఆర్ కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ టాక్టర్‌లో 30మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా కూలీలు. మిరపచేనులో పనుల కోసం వెళుతూ మృత్యువాత పడ్డారు. పడమటితండా నుంచి పులిచర్లలోని కూలీ పనుల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులలో రమావత్‌కెళీ(50),రమావత్ కంస్లి(50), రమావత్ భారతి (35), రమావత్ సునీత (30), జరుకుల ద్వాలీ(30), లక్ష్మీగా గుర్తించారు. మృతుల బంధువుల రోదనలతో ఏఎంఆర్ కాలువ వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.