అదిలాబాద్

పోలీసులు ప్రజా సేవకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, అక్టోబర్ 25: పోలీసులు ప్రజా సేవకులని కుంరంభీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం పోలీసులు మీ కోసం జనమైత్రి కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌గాం ఆశ్రమ పాఠశాలలో బెజ్జూరు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించిన సందర్బంగా మాట్లాడారు. పోలీసులు జనం కోసం 24గంటలు పనిచేస్తారని, పోలీసులు, ప్రజల మద్య సత్సంబంధాలు పెంచడానికే జనమైత్రి కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు మిత్రులేనని, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు తమ దృష్టికి తీసుకవస్తే తక్షణమే స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. బెజ్జూరు పోలీసుల ఆధ్వర్యంలో కమ్మర్‌గాం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరానికి మంచి స్పందన ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్య సౌకర్యాలు లేని గిరిజన గ్రామాలకు వైద్యం అందించేందుకే ఉచిత వైద్య శిభిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గ్రామీణులను పట్టణాలకు తరలించి పోలీసుల ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. కమ్మర్‌గాం, మొర్లీగూడెం రోడ్డు సౌకర్యం కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంత కమ్మర్‌గాం, మొర్లీగూడెం గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, మారుమూల గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కమ్మర్‌గాం గ్రామంలో బి ఎస్ ఎన్ ఎల్ టవర్ కోసం కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా తమదృష్టికి తీసుకువస్తే సేవలందిస్తామని తెలిపారు. కమ్మర్‌గాం యువకులు జిల్లాలో క్రీడల్లో గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
అనంతరం మారుమూల గ్రామాల కమ్మర్‌గాం, మొర్లీగూడెం గ్రామాల్లోని పేదలకు 35క్వింటాళ్ల బియ్యం, క్రీడాకారులకు క్రికెట్ కిట్లు, వృద్దులకు దుప్పట్లు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం కాగజ్‌నగర్ డీ ఎస్పీ హబీబ్‌ఖాన్ మాట్లాడారు. మారుమూల గ్రామమైన కమ్మర్‌గాంలో బెజ్జూరు పోలీసు ఆధ్వర్యంలో ఉచిత శిభిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ సి ఐ రమేష్ బాబు, కౌటాల సి ఐ అచ్చేశ్వర్‌రావు, రెబ్బెన సి ఐ మదన్ లాల్, కాగజ్‌నగర్ ఐ ఎం ఎ అధ్యక్షుడు శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్, డాక్టర్లు రమేష్ బాబు, సుందరం, కృష్ణమూర్తి, రాజు, అనిల్ కుమార్, పార్థసారథి, ఎస్సైలు రాజు, దీకొండ రమేష్, ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, శ్రీదర్, స్థానిక సర్పంచ్ మడప శ్రీనివాస్, సల్గుపెల్లి సర్పంచ్ విశేశ్వర్ రావు, బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కో ఆర్డినేటర్ నారాయణ రెడ్డి, బెజ్జూరు తెరాస నాయకులు సదాశివ్, జగ్గాగౌడ్, బుచ్చిరాం, బాస్కర్, జావేద్ అలీ, నరేందర్, కనికుట్ల వెంకటేష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.