అదిలాబాద్

వచ్చే వర్షాకాలానికి మొక్కలు సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, అక్టోబర్ 25: వచ్చే వర్షాకాలంలో నాటడానికి మొక్కలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కరుణన్ సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్‌లో తన అధ్యక్షతన చీఫ్ కంజర్వేటర్ సంజయ్‌కుమార్ గుప్తాతో కలసి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 వర్షాకాలంలో చేపట్టనున్న తెలంగాణ హరితహారం కార్యక్రమంపై అటవీ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, సింగరేణి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడానికి నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని 1.28కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, వచ్చే సంవత్సరం 2.60కోట్ల మొక్కలు నాటడానికి నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు. వాతావరణానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని సూచించారు. ఇంటి పెరడులలో, పొలంగట్లపై , రోడ్డుకు ఇరువైపులా, నీటి ప్రాజెక్టుల కాల్వలకు ఇరువైపులా, విద్యా సంస్థల్లో, ఫ్యాక్టరీల్లో, చెరువుల గట్లపై, అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలిపారు. ఈ మొక్కలను ఆయా ప్రాంతాలకు అనుగునమైన మొక్కలు నాటాలని సూచించారు. వచ్చే సంవత్సరానికి అటవీ శాఖ ద్వారా 30లక్షలు, సోషల్ ఫారెస్ట్ విభాగం ద్వారా 45లక్షలు, గ్రామీణ అభివృద్ది శాఖ ద్వారా 55లక్షలు, సింగరేణి ద్వారా 15లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 4లక్షలు, హార్టికల్చర్ ద్వారా 5లక్షలు, సెరి కల్చర్ ద్వారా లక్ష మొక్కలను పెంచడానికి అటవీ శాఖ ప్రతిపాదించింది. అంతే కాకుండా సింగరేణి యాజమాన్యం అటవీశాఖ కేటాయించిన దాని కంటే పది లక్షల మొక్కలు అదనంగా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ కాకతీయ కింద మరమ్మత్తులు పూర్తయిన చెరువుల గట్ల కింద ఈత చెట్లు, అడవులలో కోతుల కోసం పండ్ల మొక్కలను నాటాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు పెంచాలని తెలిపారు. ఐటిడి ఎ ఆధ్వర్యంలో బెల్లంపల్లి, బీమారంలో గల నర్సరీలను మొక్కల పెంపకానికి వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి ప్రభాకర్, బెల్లంపల్లి, మంచిర్యాల, జన్నారం డివిజన్ ఫారెస్ట్ అధికారులు తిరుమల్‌రావు, వెంకటేశ్వర్ రావు, దామోదర్, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీ ఎం సుబాని, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకట్, పరిశ్రమల అదికారి జేమ్స్ కల్వల్, ఈ ఈ ఇరిగేషన్ వేణుగోపాల్ రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి దాదా రావు, తదితరులు పాల్గొన్నారు.