అదిలాబాద్

పత్తి కొనుగోళ్లు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, అక్టోబర్ 25: అన్ని మార్కెట్ యార్డుల్లో కాటన్‌కార్పొరేషన్ ఇండియా ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పార్థసారథి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి, సోయా కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నందున జిల్లా కలెక్టర్లు అన్ని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు.
ముఖ్యంగా కుమ్రం భీం జిల్లాలో పత్తి,సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు. ఐకెపి కేంద్రాల్లో సెర్ఫ్ అధ్వర్యంలో సోయా, మొక్కజొన్న, రాగులు తదితర ఉత్పత్తులను కొనుగోలు జరగనున్నందున, ఎక్కువగా రైతులు ఈకేంద్రాల్లోనే పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చే అవకాశాలున్నాయన్నారు. అలాగే ప్రధానమైన పత్తి పంటను కాటన్‌కార్పొరేషన్ సంస్థతో పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.