అదిలాబాద్

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 25: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ మండలాల ఎం ఈవొలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలను ఎం ఈవొలు తరచుగా పర్యవేక్షన చేయాలన్నారు. పాఠశాలల్లోని సమస్యలను సమీక్షించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. పాఠశాలల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం తప్పనిసరిగా అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్ని పాఠశాలలకు టాయిలెట్స్ మంజూరైనవి, పూర్తయిన, బిల్లులు చెల్లించిన వాటి వివరాలను మండలాల వారీగా జాబితా తయారుచేయాలని ఎం ఈవొలను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో హాజరురిజిస్టార్ అప్‌డేట్‌గా ఉండాలని, ఆకస్మిక సెలవుల మంజూరురిజిస్టార్ నిర్వహించాలని ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్‌కు సంబంధించిన నిధులు ఆదిలాబాద్ నుండి నిర్మల్ జిల్లాకు వచ్చేటట్లు చూడాలని డి ఈవొను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్వశిక్ష అభియాన్ ఈ ఈని ఆదేశించారు.