అదిలాబాద్

కూరగాయల సాగుపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, అక్టోబర్ 25: వచ్చే కరీఫ్ సీజన్‌లో పత్తి పంట సాగు తగ్గించి అంతర్ పంటలను పండించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుండే ప్రణాళిలకలను రూపొందించుకోవాలని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. కూరగాయల సాగుపైనా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా ఈసీజన్‌లో 1.30లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని కలెక్టర్ తెలిపారు. వచ్చే కరీఫ్ నాటికి ఈభూముల్లో పత్తి పంట సాగును తగ్గించి, అంతర్‌పంటల రైతులు వైపుమొగ్గుచూపేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి నుండే అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించి కరీఫ్‌లో సోయా, మొక్కజొన్న, వరి, జొన్న,పప్పుదినుసుల సాగు చేసే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. నేల సారవంతాన్ని బట్టి పంటలు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశాలున్నాయన్నారు. పండించిన పంటలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే విషయాలను రైతులకు క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత మార్కెటింగ్ అధికారులపై ఉందన్నారు. అలాగే కూరగాయల సాగుతో చేకూరే లాభాలను రైతులకు వివరించి, అందుకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాలని కలెక్టర్ ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు. పండ్లతోటల పెంపకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి నిమ్మ, సీతాఫల్, రేగుపండ్లు,సపోట తదితర మొక్కల సాగును ప్రోత్సహించాలన్నారు. నీటివినియోగాన్ని తగ్గించేందుకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకోవాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన సహాయ సంచాలకులు ఎంఏ సత్తార్, అలీ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.