అదిలాబాద్

కనీస మద్దతు ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 25: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్యదళారుల బెడదలేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టి కనీస మద్దతు ధర కల్పించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారథి జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుండి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, మార్కెట్‌యార్డు అధికారులు, వ్యవసాయశాఖ అధికారులతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై సమీక్షసమావేశం నిర్వహించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మార్కెట్‌యార్డులలో రైతులకు అవసరమైన వౌళిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 సిసి ఐ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సిసిఐ కేంద్రాలు రైతుల నుండి కనీస మద్దతుధరతో పత్తికొనుగోళ్లు జరిపి రైతులకు న్యాయం చేకూర్చాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్లు ప్రత్యేకశ్రద్ద వహించి మార్కెట్‌యార్డులను పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు సజావుగా జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించిన మద్దతుధరలకు అనుగుణంగా పత్తి, సోయా, కందులు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా హరితహారం పథకం ప్రిన్స్‌పల్ కార్యదర్శి బి.ఆర్ మీనా హరితహారం పథకం అమలులో భాగంగా జిల్లాల వారీగా సమీక్షించి, పథకం అమలుపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా జిల్లాల వారీగా లక్ష్యంమేరకు నాటిన మొక్కలను రక్షించడానికి అండ్‌వాచ్ ద్వారా మొక్కలను సంరక్షించాలని, జియోట్యాగింగ్ విధిగా నిర్వహించి సీడ్లింగ్ ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడింగ్ చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో జియోట్యాగింగ్, సీడ్లింగ్ అప్‌లోడింగ్ శాతం తక్కువగా ఉందని, వెంటనే శాతాన్ని అధిగమించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో తాంసి, జైనథ్, బేల, ఇంద్రవెల్లి, నార్నూర్, బోథ్ మండలాల్లోని మార్కెట్‌యార్డుల ద్వారా సోయాకొనుగోళ్లు ప్రారంభించామని, పత్తి కొనుగోళ్లకొరకు ఆదిలాబాద్, బోథ్, పొచ్చర, నేరడిగొండ, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మార్కెట్‌యార్డులను సిద్దం చేస్తున్నామని అన్నారు. ఈ మార్కెట్ యార్డులలో రైతులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హరితహారం పథకంలో భాగంగా జిల్లాలోని మార్కెట్‌యార్డులలో 13195 మొక్కలు నాటడం జరిగిందని, సంరక్షణ బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించి, వాచ్ అండ్ వాచ్ నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి ఐలయ్య, జిల్లా అటవీ శాఖాధికారి ఎస్.రాంబాబు, జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి సురేష్‌కుమార్, కార్యదర్శి అడెల్లు, తదితరులు పాల్గొన్నారు.