అదిలాబాద్

నేరాల అదుపుకు సిసి కెమెరాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం, నవంబర్ 23: దొంగతనాలు, దోపిడిలను నియంత్రించడానికే సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని మంచిర్యాల డిసిపి జాన్‌వెస్లీ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని బస్టాండ్, కవ్వాల ఆటో పాయింట్, దర్మారం చౌరస్తా వద్ద సిసి కెమెరాలు ప్రారంభించిన అనంతరం పి ఆర్‌టియు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి మాట్లాడారు. ఇటీవల కాలంలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడానికి సిసి కెమెరాలు దోహదపడుతాయని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులున్నా నిర్భయంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో గుడుంబా, బెల్ట్‌షాపులు నిర్వహించరాదని అన్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని, మద్యం సేవించి వాహనాలను నడపడంతో నిండు ప్రాణాలు గాలిలోకలిసిపోతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసిపి రమణరెడ్డి, లక్సెటిపేట సిఐ మోహన్, ఎస్సై ప్రసాద్, అదనపు ఎస్సై ఖయ్య్‌ం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పంట భూముల్లో నీటి తొట్టిలు నిర్మించుకోవాలి
* డ్వామా పిడి వెంకటేశ్వర్లు
ఖానాపూర్, నవంబర్ 23: రైతులు సాగుచేసే పంటభుముల్లో నీటి తొట్టెలు నిర్మించుకునేలా దృష్టిసారించాల్సిన బాధ్యత ఈజియస్ అధికారులదేనని డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపిడివొ కార్యాలయ సమావేశ మందిరంలో ఈజియస్ సి ఎలు, ఎఫ్ ఎలు, పంచాయతీ కార్యదర్శులు సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటితొట్టిల నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని, డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయకుంటే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులు, సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్లే లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని అన్నారు. గ్రామాల్లో రైతులు నాటిన మొక్కలను సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మొక్కల సంరక్షణ అందరి భాద్యతన్నారు. ప్రతీ గ్రామంలో సుమారు 10కిపైగా నీటితొట్టిలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివొ లింబాద్రి, ఈవొపి ఆర్‌డి చిక్యాల రత్నాకర్‌రావు, ఎపివొ సదానందచారి, తదితరులు ఉన్నారు.

పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలి
* మాజీ ఎంపి రాథోడ్ రమేష్
నార్నూర్, నవంబర్ 23: తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రాథోడ్ రమేష్ అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎంపి రాథోడ్ రమేష్, ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బానిలు ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాజీ ఎంపి రాథోడ్ రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులకు పూర్తిరుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశాడని, దశల వారీగా రుణమాఫీ చేయడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలపక్షాన పోరాటాలు చేసేందుకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ముందుండాలని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ జాలమ్‌సింగ్, టిడిపి మండల అధ్యక్షుడు జాకురుల్లాఖాన్, షేక్ హుస్సేన్, రాథోడ్ విజయ్, రాథోడ్ సుభాష్, జయవంత్‌రావు, బాపురావు, బలిరాం తదితరులు పాల్గొన్నారు.

అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ ఏర్పాటు
* కుంరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 23: జన నివాసాల్లో అక్కడక్కడా ఉన్న మాంసం విక్రయ దుకాణాలు, కూరగాయల మార్కెట్ వద్ద గల స్థలాన్ని కుంరంభీం జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. మొదట మాంసం దుకాణాలు మార్చాలని, అనంతరం కూరగాయల మార్కెట్‌ను మార్చాలని అందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని సర్వేయర్ గుణవంత్‌రావును ఆదేశించారు. మార్కెట్‌కు అనుకూలంగా మ్యాప్‌ను తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ మోహన్‌రావు, ఎంపిడివో శ్రీనివాస్, డిపివో గంగాదర్ గౌడ్, సర్పంచ్ మర్సుకోల సరస్వతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్‌లు ఉన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌లు పనితీరు సరిగాలేదు
* ఆగ్రహం వ్యక్తం చేసిన డిఆర్‌డిఎ పిడి వెంకటి
మందమర్రి రూరల్, నవంబర్ 23:్ఫల్డ్ అసిస్టెంట్‌లు విదులు నిర్వాహణలో నిర్లక్ష్యంపై డిఆర్‌డిఎ పిడి బి వెంకటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మందమర్రి మండలంలోని ఫీల్ అసిస్టెంట్‌లు పని తీరు బాగాలేదని తనకు తెలిసిన సమాచారం మేరకు ప్రత్యేకంగా బుధవారం స్థానిక మండ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరూ సక్రమంగా పనిచేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరూ కూడా తమ విదులు సక్రమంగా నిర్వహించలేదని, హరితహారం మొక్కలు చనిపోకుండా ఏ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం మొక్కలు నాటిన నుండి వాటిని పరిరక్షించే బాద్యత ఫీల్డ్ అసిస్టెంట్ లకు అప్పజెప్పడం జరిగినా వారు మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయడం గాని, నీరు పోయించడం గాని, చేయలేదని, కనీసం ఎన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయి , ఎన్ని చనిపోయాయన్న రికార్డులు కూడా వారి వద్ద లేవని ఆయన అన్నారు, గ్రామపంచాయితీలలో ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని, ఎంతమంది ఆ విదంగా చేస్తున్నారని ఆయన అడిగితే ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి సమాధానమే లేదు. ఒక్కరూ కూడా ప్రభుత్వం మొక్కలు పెంచడానికి ఇచ్చిన నిదులు ఎవరికి కూడా పేమెంట్ చేయలేదని, అంటే వారు ఎంత బాగా పనిచేసారన్నది అర్దం అవుతున్నదన్నారు. మరల వచ్చే బుదవారం నాటికి అన్ని రికార్డులతో ఫీల్డ్ అసిస్టెంట్లు అప్ టు డేట్ గా రావాలని ఆయన ఆదేశించారు. ఆవిదంగా రాని వారు విదుల నుండి తొలగించ బడతారని ఆయన హెచ్చరించారు. కొత్త జాబ్ కార్డులు ఇవ్వడంలో, చనిపోయిన వారిని జాబ్ కార్డుల లిస్టుల నుండి తొలగించడంలో, పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆయన అన్నారు. దీని అంతటికి ఇజిఎస్ అధికారి, ఎంపిడిఒల నిర్లక్ష్యమే కారణమని వారి పర్యవేక్షణ లోపమేనన్నారు. ఇక పై ఇలాంటి చర్యలను తాను సహించబోనని పనిచేయని వారు ఎవరైనాసరే వారిపై చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎంపిపి బొల్లి శెట్టి కనకయ్య మాట్లాడుతూ కేవలం ఫీల్ అసిస్టెంట్ పై పర్యవేక్షణ, పనులపై పరిశీలన లేకపోవడంవల్లనే ప్రభుత్వ పథకాలు దెబ్బతింటున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ప్రవీణ్‌కుమార్, వైస్ ఎంపిపి గొపతి రాజయ్య, ఇజిఎస్ అధికారిణి రజియాబేగం, ఇఒపిఆర్‌డి నజీరుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి
* ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కెరమెరి, నవంబర్ 23: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి అన్నారు. గ్రామాల్లో వౌళిక సదుపాయాలు కల్పించి పల్లెసీమల రూపురేఖలు మారుస్తామన్నారు. బుధవారం మండలంలోని లక్మాపూర్ పెద్దవాగుపై రూ.3కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉమ్రి పెద్దవాగుపై రూ.4కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్దికి తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలను అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఐటిడిఎ ద్వారా రూ.19కోట్లు మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మాచర్ల గణేష్, మండల ఉపాధ్యక్షుడు రాథోడ్ గోవింద్ నాయక్, కరంజీవాడ సర్పంచ్ రాథోడ్ శంకర్, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్ నాయక్, నాయకులు గుజ్జుల వెంకటేశ్వర్లు, తిరుపతి, ఎస్‌కె యునుస్, మడావి రఘునాథరావు, డిఇ నర్సయ్య, ఎఈ వెంకటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిమ గిరిజనుల అభివృద్దికి కృషి
* ఐటిడిఏ ఇంచార్జి పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, నవంబర్ 23: ఆదిమ గిరిజనుల అభివృద్దికి రూ.10 కోట్లతో కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటిడి ఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా పివో మాట్లాడుతూ తోటి, కొలాం, మనె్నవారు తదితర ఆదిమ గిరిజనుల కోసం వైద్యం, పౌష్టికాహారం, జీవనోపాధి కల్పిస్తున్నామని అన్నారు. అదే విధంగా అవసరాల మేరకు ఆదిమ గిరిజనులను చైతన్యపరుస్తామని అన్నారు. పౌష్టికాహారంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఐసిడి ఎస్, జిసిసి ద్వారా పౌష్టికాహార కిట్లు అందిస్తున్నామని అన్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఏ ఎన్ ఎం, డి ఎన్ ఎం, కంప్యూటర్, కుట్టు శిక్షణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దుతామని అన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.5వేలు, పిజి, యూజిసి విద్యార్థులకు రూ.10వేల చొప్పున ఉపకార వేతనాలు అందిస్తామని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్దిపర్చడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పివో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ అధికారులు రాంమూర్తి, నాగోరావు, ప్రభాకర్ రెడ్డి, విజయ్‌కుమార్, గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.

వారసత్వ ఉద్యోగాలపై చట్టబద్దత కల్పించాలి
* కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తున్న కేసీఆర్
* ఎఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య
బెల్లంపల్లి, నవంబర్ 23: గత నెల 6వ తేదీన సి ఎం కేసీ ఆర్ కార్మికులకు ప్రకటించిన వారసత్వ ఉద్యోగాలపై చట్టబద్దత కల్పించాలని ఏ ఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని శాంతిఖని గేట్ మీటింగ్‌కు వై.గట్టయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ గేట్‌మీటింగ్ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, గోలేటి, బెల్లంపల్లి బ్రాంచిల ఇంచార్జి చిప్ప నర్సయ్య, శాంతిఖని ఫిట్ సెక్రటరీ సారయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా గట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీ ఆర్ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా వారి సమస్యలను విస్మరిస్తున్నారని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలపై మొదటి సంతకం చేయిస్తానన్న టిబిజికే ఎస్ నాయకులు నాలుగు సంవత్సరాల కాలంలో కార్మికులకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయమై ఏ ఐటియుసి ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కార్మికులు 35రోజుల సకల జనుల సమ్మె చేస్తే షిక్ లీవ్‌లో ఉన్న 2693 మంది కార్మికులకు కేసీ ఆర్ సకల జనుల సమ్మె వేతనాలు ఎందుకు చెల్లించలేదో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిబిజికే ఎస్ ఏ ఐటియుసిని విమర్శించడం పనిగా పెట్టుకుందన్నారు. కేసీ ఆర్ మాటే సర్క్యూలర్ అన్న టిబిజికే ఎస్ నాయకులు కార్మికులకు వారసత్వ ఉద్యోగాలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో సమాదానం చెప్పాలన్నారు. అంతే కాకుండా కార్మికుల కోసం జాతీయ సంఘాలు ఏం చేశాయని, లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని, వేజ్‌బోర్డు, ఎల్‌టిసి, ఎల్ ఎల్‌టిసి, లాభాల వాటా జాతీయ సంఘాలతోనే సాధ్యమని గుర్తు చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయమై గోలేటి నుంచి మణుగూరు దాకా ఏ ఐటియుసి ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టామని తెలిపారు. కార్మికులకు చందా డబ్బులు ఇచ్చే విషయమై టిబిజికే ఎస్ అగ్ర నాయకులు జైలుకు వెళ్లారని విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన వారసత్వ ఉద్యోగ ప్రకటనపై ప్రభుత్వం చట్ట బద్దమైన సర్క్యూలర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ ప్రయోజనాల కొరకే ఏ ఐటియుసి పోరాడుతుందని, రానున్న రోజుల్లో ఏ ఐటియుసిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాంచి ఉపాద్యక్షుడు దాగం మల్లేష్, కేంద్ర కమిటీ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, అసిస్టెంట్ సెక్రటరీ తిరుపతి గౌడ్, నాయకులు రత్నం రాజం, రాంచెందర్, కుందేళ్ల సంజీవ్, శ్రీనివాస్, ఎల్తూరి సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి
* కలెక్టర్ చంపాలాల్
తిర్యాణి, నవంబర్ 23: మండలాన్ని బుధవారం కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్, జిల్లా రెవెన్యూ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌లు తిర్యాణి మండలాన్ని సందర్శించి మండలంలో నెలకొన్న సమస్యలను మండల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తహసిల్దార్, ఎంపిడివో కార్యాలయాలతో పాటు 30పడకల ఆస్పత్రిని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా మండల శాఖాధికారులతో శాఖల వారీగా వివరాలతో పాటు జరుగుతున్న పనులను, నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఉల్లిపిట్ట గ్రామానికి ఓ వైపు వట్టివాగు ప్రాజెక్టు, మరో వైపు ఓసిపి డంప్‌యార్డు కారణంగా గ్రామస్తులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సింగరేణి సంస్థతో మాట్లాడుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మండలంలో రహదారులు లేని గ్రామాల పరిస్థితి, సెల్ సిగ్నల్ లేకుండా ఉపాధి కూలీలు, ఫించన్ లబ్దిదారులు పడుతున్న అవస్థల గూర్చి అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే 30పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం గది లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎస్‌పిహెచ్‌వో సుదీర్ కలెక్టర్‌కు తెలిపారు. కాగా కలెక్టర్ చంపాలాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు చెలిమెల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శ్రీలతతో మాట్లాడారు. ఎవరు ఏ చిన్న అనారోగ్యానికి గురైనా ఆస్పత్రికి రావాలని ఆయన సూచించారు. అలాగే విద్యార్థులు అనారోగ్యానికి గురైనపుడు వెంటనే వైద్యశాలలకు తరలించాలని పాఠశాల ఏ ఎన్ ఎంను ఆదేశించారు. ప్రసవాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. మండలంలో రోడ్లు, అటవీ హక్కుల చట్టం పత్రాలు, డోల్పుల వాగు ప్రాజెక్టు కాల్వల మరమ్మత్తు తదితర సమస్యలు పరిష్కరించాలని తిర్యాణి మండల ఆదివాసీ జే ఏసీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ అమృత్‌సాగర్, ఎంపిడివో రఫీక్ హైమద్, తిర్యాణి ఎస్సై బుద్దె స్వామి, ఈజీ ఎస్ ఏపీవో శ్రీనివాస్, ఏ ఈ రాంచెంద్రయ్య, వైద్యాధికారులు సతీష్‌కుమార్, తదితరులున్నారు.

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
* జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి
తలమడుగు, నవంబర్ 23: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ఇప్పటి నుండే ప్రణాళికబద్దంగా చదువాలని జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్దప్రకాష్ అన్నారు. బుధవారం మండలంలోని తలమడుగు జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలతో పాటు లింగిలోని కస్తూర్భాగాంధీ పాఠశాలను సందర్శించి, అక్కడి విద్యాప్రమాణాలపై ఆరా తీశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థులందించిన సమాదానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీఎస్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పచ్చదనంపై కలెక్టర్ సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, అక్కడికి వచ్చిన ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, ఆర్జీదారులు, రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అక్కడినుండి లింగి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. గదులు సరిపడ లేకపోవడంతో తరగతి గదుల్లోనే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నామని, అదనపు గదులు నిర్మించాలని పాఠశాల సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని, వేడినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థినిలు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడంతో పాటు వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లతో పట్టుసాధించేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, ఎంఈవో కౌశల్య, తహసీల్దార్ రాయిసిడాం చిత్రు, ఎంపిడీవో సునీత, ఐసిడి ఎస్ సూపర్‌వైజర్ కుస్మ, ఎంఆర్‌ఐలు లచ్చిరాం, ఆజీం, రెవెన్యూ సిబ్బంది, పాఠశాల ప్రదానోపాధ్యాయుడు బండి రమేష్, ఉపాధ్యాయులు రత్నాకర్ రెడ్డి, మహేందర్ యాదవ్‌లు ఉన్నారు.