అదిలాబాద్

మహిళల ఆర్థిక స్వావలంభనే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 2: మహిళలు, రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం పట్టణంలోని సోఫీనగర్‌లో గల పాలశీతలీకరణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పాలను శీతలీకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రతీరోజు ఎన్ని లీటర్ల పాలను సేకరిస్తున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలసేకరణను 2 వేల లీటర్ల నుండి 25 వేల లీటర్లకు పెంచాలని సూచించారు. ప్రభుత్వం విక్రయిస్తున్న విజయపాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇక్కడి పాలశీతలీకరణ కేంద్రం అభివృద్దికి రూ. కోటి నిధులతో ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అవి మంజూరవుతాయన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోందన్నారు. పశుసంవర్ధకశాఖ ద్వారా అందజేసే పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులు గేదెల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని సూచించారు. పాల ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్నందున పాల దిగుబడులు పెంచేందుకు కృషిచేయాలన్నారు.
ఇక అన్నిశాఖలో డిజిటల్ చెల్లింపులు....
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అన్నిశాఖల్లో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నగదురహిత లావాదేవీలపై, డిజిటల్ చెల్లింపులపై మీసేవా సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఈ శిక్షణను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి వారినుద్దేశించి మాట్లాడుతూ నగదురహిత లావాదేవీలను జరిపేవిధంగా ఆయా గ్రామాల ప్రజలను ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ ఒక్కరు డిజిటల్ చెల్లింపులపై అవగాహణ కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తులో నగదు పూర్తిగా కనిపించకుండా చేయడమే ప్రభుత్వాల లక్షమన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల పరిశీలన....
సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారంలో రూ.వెయ్యి కోట్ల నిధులను వెచ్చించి చేపడుతున్న 400 కెవి, 220 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పనులు పూర్తయితే రైతులకు, గృహవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఇలంబరిది, జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య, మార్కెట్ కమిటి ఛైర్మెన్ దేవెంధర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, తహసిల్దార్ రాజేశ్వర్, నాయకులు రాంకిషన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, చెనిగారపు నరేష్, ధర్మాజి రాజేంధర్, రమేష్‌రెడ్డిలతోపాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.