అదిలాబాద్

పేదింటి కుటుంబాల్లో కళ్యాణలక్ష్మి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఆర్థిక స్థోమత లేని పేదింటి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందని, ఆడ పిల్లల పెళ్ళిళ్ల కోసం తెల్లరేషన్‌కార్డు ఉన్నవారందరికి రూ.51వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి రామన్న అన్నారు. శుక్రవారం జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో జైనథ్, బేల మండలాలకు చెందిన 204 మంది వివాహిత ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లబ్దిదారులకు కోటి 4లక్షల వ్యయంతో కూడిన చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని, నిమ్నవర్గాల వారు ఇప్పటికీ అసమానతలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆత్మగౌరవం నింపేందుకు పలు అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ముఖ్యంగా పేదవర్గాలు తమ ఆడ పిల్లలకు పెళ్ళీళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా పరిగణమిస్తుందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపి ఆర్థికంగా చేయూతనందించే ముఖ్యమంత్రి కెసి ఆర్ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పేద వర్గాలకు ఆసరా పింఛన్ల ద్వారా తమ ప్రభుత్వం చేయూతనందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సంక్షేమ, అభివృద్ది ఫలాలు పేద వర్గాలకు చేరినప్పుడే ఆ పథకాలకు సార్థకత లభిస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే పథకాలు విజయవంతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల వద్ద పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించబడుతుందని, బాలామృతం పథకం ద్వారా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మంత్రి రామన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెసి కె.కృష్ణారెడ్డి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఠాక్రె వనీత గంబీర్, టీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, బేల జడ్పీటీసీ దేవన్న, ఎంపిపి రఘుకుల్ రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మస్కె తేజ్‌రావు, జైనథ్ సర్పంచ్ ఆత్రం జ్యోతి, టీ ఆర్ ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, లింగారెడ్డి, చంద్రయ్య, సాజిదోద్దిన్, జైనథ్ తహసీల్దార్ ప్రభాకర్, బేల తహసీల్దార్ నందకిషోర్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.