అదిలాబాద్

చెనాకకోర్ట పనుల నిర్లక్ష్యంపై కలెక్టర్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఆదిలాబాద్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే పెన్‌గంగా బ్యారేజి నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెనాకకోర్ట కాలువల నిర్మాణం, బ్యారేజీల విషయంలో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సంధర్భంగా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా సరిహద్దులోని బ్యారేజి నిర్మాణ ప్రదేశమైన చెనాకకోర్ట వద్ద సాగుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈసంధర్భంగా అక్కడే అధికారుల వద్ద ఉన్న మ్యాప్‌ను పరిశీలించి, ఏమేరకు భూములు ముంపుకు గురయ్యాయో, ఎన్ని ఎకరాలకు సాగునీరందిస్తారన్న విషయంలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెనాకకోర్ట పనుల్లో నాణ్యత లోపించకుండా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని, నిర్ణీత గడవులోగా ఆయకట్టుకు సాగునీరందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిరెండు నెలలు గడిచినా వాటర్ డైవర్టింగ్ పనులను ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. నిర్మాణ ప్రదేశంలో నిలిచిపోయిన వరదనీటిని వెంటనే తొలగించి, పనులు ప్రారంభించాలని, ఇంజనీరింగ్ అధికారులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. నత్తనడకన పనులు సాగితే తాము ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా పెన్‌గంగా ప్రాజెక్టు మేనేజర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మూడు వారాల్లోగా వాటర్ డైవర్టింగ్ పనులు పూర్తిచేస్తామని, నాణ్యతవిషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం గూడ గ్రామం వద్ద నిర్మిస్తున్న కాలువల నిర్మాణ పనులను, పంపుహౌస్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, పంపు హౌస్, బ్యారేజి నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు పనుల వేగవంతంపై నివేదికలు అందించాలని, లేనట్లయితే ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట నీటి పారుదల శాఖ ఈ ఈ సత్యరాజ్ చంద్ర, జైనథ్ తహసీల్దార్ ప్రభాకర్, కోర్ట సర్పంచ్ అడెల్లు, గూడ సర్పంచ్ తోట రమ తదితరులు పాల్గొన్నారు.