అదిలాబాద్

ఎమ్మెల్యే కోనప్పపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 2: సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ఎన్నికల ప్రలోభాలకు సంబంధించిన కేసును శుక్రవారం ఆదిలాబాద్ పిసిఆర్ కోర్టు మెజిస్ట్రేట్ భారతి ఎర్ర కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా కాగజ్‌నగరలోని తన నివాసం వద్ద కొందరు సామూహిక భోజనం చేయగా, మరికొందరూ పోలీసు కానిస్టేబుళ్ళు సైతం ఈ విందులో పాల్గొన్న సంఘటనలో ప్రత్యర్థుల ఫిర్యాదు మేరకు అప్పట్లో ఎన్నికల అధికారులు కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు నాగేశ్వర్‌రావులపై కేసు నమోదు చేశారు. అదే విధంగా సిర్పూర్, కాగజ్‌నగర్ పాఠశాల ఆవరణలో షామియాన వేసి తాగునీటిని సరఫరా చేసినందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై కోనేరు కోనప్పపై కమీషన్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ జిల్లా కేంద్రమైన పిసిఆర్ కోర్టుకు బదిలీ చేయగా కేసు విచారణలో పలు దఫాలుగా కోర్టుకు హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన పిమ్మట న్యాయమూర్తి కోనప్ప, నాగేశ్వర్‌రావులపై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తూ శుక్రవారం సాయంత్రం తీర్పునిచ్చారు.