అదిలాబాద్

పనిచేసే ఉద్దేశం లేకుంటే వైదొలగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, డిసెంబర్ 2: పేదలకు వైద్య సేవలందించి సర్కారు వైద్యంపై భరోసా కల్పించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది విధులు విస్మరించి ప్రైవేటు క్లినిక్‌లను నిర్వహించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం, ఇదే తరుణంలో సర్కారు వైద్యం అందక పేదలు అవస్థలు పడుతున్న వైనంపై కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ సీరియస్‌గా స్పందించారు. శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ చంపాలాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంలో ఎస్‌పిహెచ్‌వో విద్యావతి మాత్రమే విధుల్లో ఉండగా, కలెక్టర్ అన్ని రిజిష్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో దంత వైద్యుడు సునీల్‌రావు, పిహెచ్ ఎన్ ప్రకాష్, మరో వైద్యురాలు పద్మావతితో పాటు హెల్త్ సూపర్ వైజర్ భరత్ పవార్, మరో అటెండర్ ముంతాజ్‌లు ఉన్నతాధికారుల ఎటువంటి అనుమతి గానీ కనీస సమాచారం కూడా లేకుండానే వారాల తరబడి విధులకు ఎగనామం అయిన విషయం గుర్తించిన కలెక్టర్ చంపాలాల్ ఈ విషయంపై అందుబాటులో ఉన్న వైద్యురాలు పద్మావతిని ప్రశ్నించారు. ఎవరి అనుమతి తీసుకొని వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని ఆగ్రహించగా, తనకు కూడా సమాచారం లేదని తెలపడంతో ఏం పనులు చేస్తున్నారని, బాధ్యత లేదా అని అంటూనే అప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారి సుబ్బారుయుడుకు ఫోన్ చేసి గైర్హాజరైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియమితులైన వైద్యులు ఖచ్చితంగా విధులు నిర్వర్తించాల్సిందేనని, విధులు విస్మరించి ప్రైవేటు క్లినిక్‌లు పెట్టుకొని అక్కడే పని చేస్తామనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఒకవేళ సొంత క్లినిక్‌లే కావాలనుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధుల నుంచి తప్పుకోవాలని, ఇష్టం వచ్చినట్లు పనిచేస్తానంటే ఆటలు సాగవని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని లేకపోతే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణంలో మున్సిపాలిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణాలు, అభివృద్ది పనులను కలెక్టర్ చంపాలాల్ పరిశీలించగా, పనుల నాణ్యత, నిర్మాణం జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్, డిప్యూటీ ఇంజినీర్ ఇంచార్జీలుగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చైర్ పర్సన్ విద్యావతి, కౌన్సిలర్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పనులు ప్రతిపాదించే సమయంలో ఖచ్చితమైన ప్రణాళికతో ఎల్లకాలం మనే్నలా పనులు చేపట్టాలని పేర్కొనడంతో పాటు అందుబాటులో లేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సురేష్ ఉన్నారు.