అదిలాబాద్

పెరిగిన కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 10: నల్లధనం వెలికితీత కోసం ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దుచేసిన నేపథ్యంలో నెలరోజులు గడిచినా కరెన్సీ కష్టాలు వీడడంలేదు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు సరిపడ కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరకపోవడంతో ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు ప్రతినిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటికితోడు శని,ఆది,సోమ బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించడంతో సామాన్య మధ్యతరగతి జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇటు ఉద్యోగులు, చిరువ్యాపులు, దినసరి కూలీలు, నిత్యావసర సరకులు, కూరగాయలు ఇతర వస్తువులు విక్రయించే సామాన్యులు సైతం డబ్బుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి పరిమితులు విధించడం, ఒకటి రెండు మినహా ఎటిఎంలు పనిచేయకపోవడంతో వ్యాపారరంగం పూర్తిగా స్థంభించిపోతోంది. ప్రజలవద్ద చిల్లర డబ్బులు దొరక్క నిత్యావసర సరకులు, కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నారు. పెళ్ళిళ్ల సీజన్‌లో డబ్బుల కొరత కారణంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి అంతటా నెలకొంది. ఇతర వ్యాపార రిజిస్ట్రేషన్, భూముల కొనుగోళ్లను జనవరి, ఫిబ్రవరికి వాయిదా వేసుకుంటున్నారు. చేతిలో డబ్బులులేక ప్రైవేట్ ఉద్యోగులు, దినసరి కార్మికులు నానా అవస్థలు పడుతుంటే మార్కెట్ యార్డుల్లోనూ పత్తి కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి వరకు ఆదిలాబాద్‌లో రోజుకు 12వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగ్గా మూడు రోజులు మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించడంతో పత్తి వ్యాపారంపై దెబ్బ పడినట్లయింది. రబీ సీజన్‌లో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం దళారులను ఆశ్రయిస్తున్నా వారి వద్ద నుండి చిల్లిగవ్వ పుట్టడంలేదు. ఆదిలాబాద్‌లో 22 ఎటిఎంలు ఉండగా వీటిలో రెండు మూడు మినహా మిగితావన్ని పనిచేయకపోవడంతో శనివారం రూ.2000నోటు కోసం బారులు తీరి అవస్థలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా పెన్షనర్లుల, ఉద్యోగులు వేతనాల కోసం పడరానిపాట్లు పడుతున్నారు. మార్కెట్‌లో రూ.2000 కరెన్సీ నోటుకు చిల్లర దొరక్క రోజు వారి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ముద్రించిన రూ.500 కరెన్సీనోటు జనం వద్దకు చేరితేనే చిల్లర కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది. నగదు రహిత లావాదేవీలపై మరింత విస్తృత అవగాహన కల్పించి, గ్రామాల్లో బ్యాంకు సేవలు, మిని ఎటిఎంలను అందుబాటులోకి తెస్తేనే మహిళా సంఘాలకు, ఉపాధి కూలీలకు, రైతులకు, పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

గిరిజనులకు పునరావాసం
కడెం, డిసెంబర్ 10: నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని అటవీ మారుమూల గ్రామాలైన మైసంపేట్, రాంపూర్ గిరిజన గ్రామాల ప్రజలు తమ గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకుంటామని కవ్వాల్ టైగర్ జోన్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్‌గుప్త అన్నారు. శనివారం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామస్థులతో అటవీ శాఖ అధికారులు, గ్రామ గిరిజనులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారంరోజుల క్రితం అయా గ్రామాల్లో అటవీ, రెవెన్యూశాఖ అధికారులు అయా గ్రామాల గిరిజనులకు పునరావాసం కోసం గిరిజన కుటుంబాల సంయుక్త సర్వే కార్యక్ర మం నిర్వహించారు. సర్వేపై అటవీశాఖ ఉన్నతాధికారులు, స్థానిక సిబ్బంది గ్రామస్తులతో ఆరాతీశారు. సర్వేలో రాంపూర్‌లో 27 గిరిజన కుటుంబాలు, మైసంపేట్‌లో 85 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు నిర్ధారణకు రావడం జరిగింది. సర్వే చేసిన కుటుంబాలు గ్రామంలో ఉంటున్నారా లేదా అన్న విషయంపై, సర్వే ఎంపిక సక్రమంగా ఉందా లేదా ఉన్న విషయంపై అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. టైగర్ జోన్ పరిధిలో గల రెండు గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మొదటి విడతలోనే నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కవ్వాల్‌టైగర్‌జోన్ పిడి సంజయ్‌కుమార్‌గుప్త గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తే ఆ గిరిజన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఐదెకరాల భూమి, అందులోనే పక్కా ఇళ్లు నిర్మాణం చేపడతామని తెలిపారు. లేదా 10 లక్షల రూపాయలు తీసుకుని పునరావాసం కల్పించుకోవాలన్నారు. ఈ రెండు ప్యాకేజిలలో ఏది అవసరం అవుతుందో మీరు తెలపాలని గిరిజనులను పిడి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి ప్రవీణ, ఖానాపూర్ ఎఫ్‌డివో రవీంధర్ రాథోడ్, జన్నారం డిఎఫ్‌వో రవీందర్, ఎఫ్‌ఆర్‌వో రాథోడ్ రమేష్, స్థానిక సర్పంచ్ జొన్నల సావిత్రి రాజయ్య, మాజీ ఎంపిటిసి జొన్నల చంద్రశేఖర్, ఎఫ్‌ఎస్‌వోలు నజీర్‌ఖాన్, శంకర్, కింగ్‌ఫిషర్, గీత, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటి ఎన్జీవో సంస్థ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్దిక్, పంచాయతీ కార్యదర్శి ప్రవీన్‌బాబు, అటవీ సిబ్బంది గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.