అదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జనవరి 15: పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జోగు సాత్విక్ (17) అనే విద్యార్థి శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని శాస్ర్తీనగర్ దక్షిణభాగంలో నివాసముండే సాత్విక్ ఇంటి పనుల కోసం బైక్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో సాత్విక్ బైక్‌పై నుండి ఎగిరిపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనలో వేగంగా ఇన్నోవా వాహనాన్ని వేగంగా నడిపి విద్యార్థి మృతికి కారణమైన వాహన డ్రైవర్ పి.రాజును అరెస్ట్ చేసి కేసు నమోదుచేసినట్లు పట్టణ సిఐ జీవన్‌రెడ్డి తెలిపారు. మృతుని తండ్రి మోహన్ లక్ష్మణచాంద మండలం చింతల్‌చాంద గ్రామానికి చెందినవారు కాగా స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సంక్రాంతి పండగపూట కొడుకు కళ్లముందే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మంత్రి అల్లోల పరామర్శ
రోడ్డు ప్రమాదంలో సాత్విక్ మరణించడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాత్విక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాత్విక్ అకాలమరణం ఆతని కుటుంబానికి తీరనిలోటన్నారు. సాత్విక్ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు భవిష్యత్తులో సాత్విక్ సోదరుడికి డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఎక్స్‌గ్రేషియాతోపాటు డబుల్‌బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీనిచ్చారు. ప్రమాదానికి కారణమైన ఇన్నో వాహనం ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌దని, ఈ వాహనాన్ని తనకు కేటాయించినప్పటికీ ప్రమాద సమయంలో డ్రైవర్ మాత్రమే వాహనంలో ఉన్నాడన్నారు. చట్టప్రకారం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, నాయకులు సత్యనారాయణగౌడ్, రాంకిషన్‌రెడ్డి, పలువరు కౌన్సిలర్లు ఉన్నారు.

ఘనంగా ఎడ్ల బండ్ల పోటీలు
ప్రథమ విజేతకు పావుతులం బంగారం
శ్రీరాంపూర్ రూరల్, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకోని మండల కేంద్రంలోని తీగల్‌పహాడ్ గ్రామ పంచాయతీలో ఎడ్లబండ్ల పోటీలను ఘనంగా నిర్వహించారు. జీవి సుధాకర్ రావు జ్ఞాపకార్థం బిజేపి నాయకుడు కోనగంటి రంగరావు ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. బిజేపి రాష్ట్ర నాయకులు గోనె శ్యాం సుందర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఎంపిపి బేర సత్యనారాయణ, ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాల నుంచి సంప్రదాయ పోటీలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జీవి సుధాకర్ రావు జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహించడం ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆహ్లాదకరంగా జరిగిన ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసారు. మొదటి బహుమతిగా మంచిర్యాల జిల్లాకు చెందిన పాత మంచిర్యాల తూమ్ముల వెంకటరామయ్య ఎడ్లబండి ప్రథమ స్థానం కైవసం చేసుకోని పావుతులం బంగారాన్ని గెలుపొందగా, ద్వితీయ బహుమతి పెద్దపల్లి జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేక్ భాషా మియా 12 తులాల వెండి, తృతీయ బహుమతిగా కుమ్రం భీం జిల్లాకు చెందిన పత్తిపాక అశోక్‌కు ఆరు తులాల వెండి, నాల్గవ బహుమతిగా సీతారాంపల్లికి చెందిన ఎర్ర చక్రవర్తికి 3 తులాల వెండిని బహుమతిగా అందజేసారు. వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పోటీదారులు పాల్గొనగా గ్రామంలో పోటీలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.