అదిలాబాద్

మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, జనవరి 15: మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం మండలంలోని ఉమ్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసాయి గ్రామం నుండి రైల్వే ట్రాక్ సమీపంలో గల హనుమాన్ ఆలయం వరకు రూ.15 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి మారుమూల గ్రామాల్లో మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రతి గ్రామంలోని అంతర్గత రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. హనుమాన్ ఆలయం వరకు నిర్మించే ఈ రోడ్డును నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పెందూర్ లక్ష్మణ్, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జనక్‌పటేల్, దాదేరావు, జ్యోతిరాం, జక్కుల ప్రభాకర్, సర్పంచ్ దంతే రమేష్, కన్వీనర్ సరసం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం అవార్డుగ్రహితకు సన్మానం
ఉట్నూరు,జనవరి 15: సామాజిక మార్పుకోసం విశేష కృషి చేసి కొమురంభీం అవార్డు అందుకున్న సుగుణక్కను ఉట్నూరు సాహితీవేదిక సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా ఉట్నూరు సాహితీవేదిక సభ్యులు శాలువతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులను చైతన్యవంతులను చేయడమే కాకుండా వారిలో మార్పుకోసం విశేషకృషి చేసిన సుగుణక్కను గుర్తించడం అభినందిస్తున్నామని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, ఏజెన్సీ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు సాహితీవేదిక సభ్యులు కట్ట లక్ష్మణచారి, లక్ష్మయ్య, గోపగాని రవిందర్, బంకత్‌లాల్, వినాయక్‌రావు, లక్కారం సర్పంచ్ మర్సుకోల తిరుపతి, సభ్యులు సరస్వతి, ఉప సర్పంచ్ లింగాగౌడ్, ఎంపిటీసీ సాదని నర్సయ్య, భుజంగ్‌రావు పాల్గొన్నారు.