అదిలాబాద్

రబీ పంటల కోసం కడెం ప్రాజెక్టు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జనవరి 15: నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుండి ఆయకట్టు పరిధిలో గల రబీ పంటల కోసం ఆదివారం కడెం ప్రాజెక్టు ఈ ఈ వెంకటేశ్వర్‌రావు, ప్రజాప్రతినిధులు జలాశయం నుండి ప్రధానకాలువ అయిన ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో 692.725 అడుగుల నీటి మట్టం ఉండగా రిజర్వాయర్‌లో 5.847 టిఎంసిల సామర్థ్యం గల నీరుందన్నారు. కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని డి-28 వరకు రబీ సీజన్ కోసం 19225 ఎకరాల పంటలకు సాగునీరందిస్తామని ఆయన చెప్పారు. రబీ సీజన్‌కుగాను కడెం ఆయకట్టు పరిధిలో గల రైతులు ఆరుతడి పంటలే సాగుచేసుకోవాలని ఆయన అన్నారు. వారబందీ పద్ధతి ద్వారా ఆయకట్టు రైతులకు 8 రోజులు కాలువ తెరిచి ఉంచి నీటి విడుదల చేస్తామని, ఆ తర్వాత ఏడు రోజులు మూసివేస్తామన్నారు. ఆదివారం కడెం ప్రాజెక్టు నుండి 370 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. కుడి కాలువలో పనులు జరుగుతుండడంతో ఈ కాలువకు రెండు మూడు రోజుల్లో రబీ పంటల కోసం 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కడెం ఆయకట్టు కింద రబీ పంటలకు ఏప్రిల్ 7వ తేదీ వరకు వారబందీ పద్ధతి ద్వారా కాలువలకు సాగునీరు విడుదల చేస్తామన్నారు. ఒకవేళ ఎస్సారెస్పీ నుండి కడెం జలాశయంలో నీరువస్తే ఏప్రిల్ 22 వరకు కూడా ఆయకట్టుకు సాగునీరందచే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, వారబందీ పద్ధతి పాటించేటప్పుడు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కడెం ప్రాజెక్టు ఇన్‌చార్జి డిఈ నాగేశ్వర్‌రావు, ఎ ఈ శ్రీనాథ్, సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి రఫిక్ అహ్మద్, ఎంపిటిసి జాడి గంగాదర్, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సత్యనారాయణ, మండల అధ్యక్షులు నల్లజీవన్‌రెడ్డి, మండల నాయకులు మినాజ్ హుస్సేన్, కడెం జడ్పీ హైస్కూల్ చైర్మన్ ముక్కెర గంగాధర్, ప్రాజెక్టు వర్క్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ క్రీడల్లో వెలుగులు నింపుతాం
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్
ఇచ్చోడ, జనవరి 15: ఆదరణ కోల్పోతున్న సాంప్రదాయ క్రీడలను వెలుగులోకి తెచ్చి క్రీడాకారుల ఉన్నతికి అన్నివిధాల కృషి చేస్తామని పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్ అన్నారు. ఆదివారం ఇచ్చోడలో గత వారం రోజులుగా జరిగిన లోక శ్రీనివాస్‌రెడ్డి స్మారక క్రికెట్ పోటీలలో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం ఎంపి మాట్లాడారు. క్రీడలు మానసికొల్లాసాన్ని కల్గించడమే కాకుండా స్నేహాభావం పెంపొందుతుందని అన్నారు. స్నేహ పూర్వక వాతావరణానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయన్నారు. గత వారం రోజులుగా ఇచ్చోడలో టిఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు దివంగత లోక శ్రీనివాస్ రెడ్డి స్మారకర్థం నిర్వహించిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండే కాకుండా పక్కరాష్టమ్రైన మహారాష్ట్ర నుండి క్రీడాకారులు రావడం అభినందనీయమని అన్నారు. క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన కిన్వట్ జట్టుకు రూ.50 వేల నగదును, రెండవ బహుమతి ఇచ్చోడ జట్టుకు రూ.25 నగదును ఎంపి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, కృష్ణకుమార్, శ్రీనివాస్, అస్లాం పాల్గొన్నారు.