అదిలాబాద్

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, మార్చి 31: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. గురువారం భైంసాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు చేపట్టారు. టికెట్ల కౌంటర్, తాగునీటి వ్యవస్థ, బస్సులు నిలుపు ప్రదేశంతోపాటు బస్టాండ్ ప్రాంగణంలోని వివిధ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ ద్వారా మరిన్ని సేవలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు.