అదిలాబాద్

అట్టహాసంగా క్రీడోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి పండగ ఉత్సవాలను పురస్కరించుకొని బజార్‌హత్నూర్ మండలం ఎంపి గెడం నగేష్ స్వగ్రామం జాతర్లలో శనివారం రాత్రి రాష్టస్థ్రాయి గిరిజన క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంపి గెడం నగేష్ ప్రోత్సాహంతో నవ జ్యోతి యూత్ క్లబ్ అధ్వర్యంలో నిర్వహించిన గిరిజన క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎంపి గెడం నగేష్‌తో పాటు అదనపు ఎస్పీ పనసారెడ్డి, డిఎస్‌డివో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, షటిల్ పోటీలను ప్రారంభించగా, వివిధ జిల్లాల నుండి క్రీడా జట్లు పాల్గొని ఉత్సాహపూరిత వాతావరణంలో పోటీల్లో తలపడ్డారు. చత్తీస్‌ఘడ్, మహారాష్టత్రో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వాలీబాల్, కబడ్డీ, షటిల్ జట్లు పాల్గొన్నాయి. ఎంపి నగేష్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా క్రీడాపోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించడం గ్రామంలో కల్పించారన్నారు. ఎఎస్పీ పనసారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు జేజేలు పలుకుతున్న నేపథ్యంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బీంబాయి, ఎంపిపి రాంరెడ్డి, జడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ, ఎంపిటీసీ లక్ష్మణ్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రమణ, నాయకులు అల్కె గణేష్, జాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.