అదిలాబాద్

గ్రామాల అభివృద్దికి అధికారులు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 23: గ్రామాల అభివృద్దిలో క్షేత్రస్థాయి అధికారులదే ముఖ్య పాత్ర, అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో జరిగిన జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల వారీగా చేపట్టిన పనులపై అడిగి తెలుసుకున్నారు. చేపల పంపిణి, మండలాల వారీగా ఎంత ప్రోడక్షన్ అయినవి అని ఆ శాఖ అదికారులను అడిగారు. అదే విధంగా రిజర్వాయర్‌లు, ట్యాంకులు, చెరువులలో కట్ల రోజు బంగారు తీగ, పలు రకాల చేపలను పెంచాలన్నారు. జిల్లాలో వైకుంఠ ఆదాయ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డంపింగ్ యాడ్ నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయని ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ నిర్మాణం జరగలేదని అధికారులు తీరుపై మండిపడ్డారు. త్వరగా డంపింగ్ యాడ్‌ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అదికారులను ఆదేశించారు. జిల్లాలో మరుగుదొడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ జి ఎస్ సిబ్బందికి, ఇతర కూలీలు, అంగన్‌వాడి సెంటర్లు 11 లోగా పనులు చేయాలని తెలిపారు. త్రాగు నీరును బస్టాండ్, తదితర ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ జి ఎస్ సిబ్బందికి పని వేళలో, ఓ ఆర్ ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉంచాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వీర బ్రహ్మయ్య, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ మల్లేష్ గౌడ్, డిఆర్‌డిఓ పిడి వెంకట్, డిపివో చంద్రశేఖర్, సహాకార శాఖ అధికారి సంజీవరెడ్డి, మత్స్య శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లాలోని ఎంపిడి ఓలు, ఈవోపిఆర్‌డిలు పాల్గొన్నారు.