అదిలాబాద్

ఆట స్థలాన్ని పాఠశాలకు విరాళంగా అందించిన సంతోష్ రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమిని, జూన్ 14: కనె్నపల్లి మండల పరిధిలో జన్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు స్పోర్ట్స్ ఆటస్థలాన్ని గ్రామానికి చెందిన మాధవరపు సంతోష్ రావు బుధవారం జడ్పీ హెచ్‌ఎస్ జన్కాపూర్ పాఠశాలకు విరాళంగా అందించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఆట స్థలాన్ని ప్రారంభించి స్థల పత్రాలను ప్రధానోపాధ్యాయునికి అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థలదాత సంతోష్ రావు మాట్లాడుతూ జన్కాపూర్‌లో పుట్టిన తాను ఇదే పాఠశాలలో 5వ తరగతి వరకు చదివిఉన్నత విద్యను హైదరాబాద్‌లో చేశానన్నారు. ఆరేళ్లపాటు హైదరాబాద్‌లో ఉద్యోగంచేసి, అనంతరం స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాను. చదువుకున్న పాఠశాలకు, ఉన్న ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో పాఠశాలకు ఆటస్థలం లేదన్న విషయం విద్యార్థులు తెలుపగా వారి కోరిక మేరకు 12గుంటల ఆట స్థలాన్ని కంపౌండ్ వాల్ నిర్మాణం చేసి అప్పగించానన్నారు. విద్యార్థుల కోసం కంప్యూటర్ అందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పాఠశాలకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆ దృష్టితోనే ఎంతో కొంత చేయాలని సంకల్పించానన్నారు. కార్యక్రమానికి రావాలని పిలువగానే జిల్లా కలెక్టర్‌స్పందించి వస్తానని ఇవ్వడం ఎంతో ఉత్తేజం ఇచ్చిందన్నారు. హెచ్‌ఎం రఘుబాబు మాట్లాడుతూ పాఠశాలకు ఆటస్థలం విరాళంగా ఇచ్చిన సంతోష్‌రావును అభినందిస్తున్నాని వారి సహకారాన్ని ఎప్పటికి మరువలేమన్నారు. వారి సహకారం మా పాఠశాల అభివృద్ధిలో ఎల్లవేళలా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ముఖ్య అతిథిగా హాజరైనర ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ విదేశాలలో ఉంటూ ఉన్న ఊరికి, చదువుకున్న పాఠశాలకు ఎంతోకొంత సాయంచేయాలనే సంకల్పించడం గొప్ప విషయమని, విదేశాలలో ఉంటూ ఉన్న ఊరును అదరించడం అభినందనీయమన్నారు. సంతోష్‌రావు చేస్తున్న పనులనుచూసి నేను కూడా నా స్వంత ఊరికి ఎదైనా చేయాలనే సంకల్పం నాలో కలిగిందన్నారు కార్యక్రమం అనంతరం సంతోష్ రావు దంపతులతో పాటు సంతోష్‌రావు తల్లి సత్తమ్మను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో వీరన్న, డిఇవో రవికాంత రావు, ఎడీవో శంకర్, జడ్పీటిసి ఆల్లీ మోహన్, ఎస్‌ఎంసి చైర్మన్ బి వెంకటేష్, సర్పంచ్ మంచర్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

నిరవధిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి
* మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
బెల్లంపల్లి, జూన్ 14: వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాల ఆధ్వర్యంలో 15 నుంచి జరిగే నిరవధిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కోరారు. బుధవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ టిబిజికెఎస్ విధానాల వల్ల నేడు కార్మికులు సింగరేణివ్యాప్తంగా సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారసత్వ ఉద్యోగాలపై మొదటి సంతకం చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు కార్మికులను మాయ మాటలతో దగా చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యల కోసం అనేకసార్లు సిపిఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం చేతకానీ తనం వల్ల హైకోర్టు, సుప్రీంకోర్టు వారసత్వ ఉద్యోగాల విషయంలో తీర్పు ఇచ్చిందన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయమై టిబిజికెఎస్ సింగరేణి యజమాన్యం రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తుందన్నారు. సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనకపోతే భవిష్యత్‌లో వారసత్వ ఉద్యోగాలే రావని కార్మికుల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను జాతీయ సంఘాలతోనే పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 10 వ తేదీన బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కెటిఆర్ ఎర్రజెండాలు ఎక్కడ ఉన్నాయని మాట్లాడాడని అసలు ఆయన తండ్రి కెసిఆర్ అధికారంలోకి రావడానికి ఎర్రజెండాలే కారణం అని గుర్తు చేశారు. బొగ్గు ఉత్పత్తికి కృషి చేసే కార్మికులపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి యజమాన్యం విష ప్రయోగం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి మంతెన మల్లేష్, సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు బొంతల లక్ష్మి నారాయణ, సోగాల శ్రీనివాస్, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.