అదిలాబాద్

పరిచయ వేదికలే.. ఆత్మీయ అనుబంధానికి ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 10: ఆర్థిక అసమానతలను రూపుమాపి, ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించే శక్తి వధువర పరిచయ వేదికలకు ఉంటుందని, ఈ సమ్మేళనంతో సరిహద్దు రాష్ట్రాల మద్య సంబంధాలు మెరుగుపడుతాయని మహారాష్ట్ర అటవీ, ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్‌లో ఆర్యవైశ్య వధువరుల పరిచయ వేదికకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్యుల్లో ఇప్పటికీ ఆర్థిక అసమానతలు తొలగిపోలేదని, పేదరికంతో మగ్గుతున్న వారి కుటుంబాలకు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్యవైశ్య సంఘాలు, వాసవి మహిళా సంఘాలు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని, ఇందుకు తనవంతు చేయూతనందిస్తానని ఆయన పేర్కొన్నారు. తాను ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు చంద్రాపూర్ జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో తనకు పెళ్ళికాలేదని, సరైన వధువు కోసం తాను ఆర్యవైశ్య పరిచయ వేదికకు హాజరై ఈ సభలోనే తన జీవిత భాగస్వామిని పొందడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్యులతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, స్వచ్చంద సేవాకార్యక్రమంలోనూ పాల్గొనడం జరిగిందన్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూనే సామాజిక అసమానతలను రూపమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల మద్య అనుబంధాలు పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. ఈ సంధర్భంగా పరిచయ వేదికలో దరఖాస్తుచేసుకున్న 55 మంది యువకులు, 34 మంది అమ్మాయిలకు అభినందనలు తెలిపారు. ఈ సంధర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నాగన్న మాట్లాడుతూ జిల్లా అంతటా ఇలాంటి వధువరుల పరిచయ కార్యక్రమాలు పెంపొందించడం జరుగుతుందని, కొత్తగా పెళ్ళిచేసుకునే వివాహ జంటలకు రూ.51వేల నగదు ఒక్కో జంటకు అందజేయడం జరుగుతుందని అన్నారు. పేద కుటుంబాలకు కూడా తమ వంతు సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జనగం సంతోష్, నాయకులు రాజు చింతావార్, జనగం సంగీత, గందె కృష్ణకుమార్, గందె విజయ్‌కుమార్, విలాస్ పాల్గొన్నారు.