అదిలాబాద్

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోథ్,జనవరి 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలలను, స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసేందుకు చర్యలు తీసుకుంటుందని బోథ్ కాం గ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు రాజుయాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్‌కుమార్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకరానున్న సర్పంచ్‌ల పరోక్ష ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిర్ణయంపట్ల నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానం ద్వారా గ్రామపంచాయతీలను స్థానిక సంస్థలకు ఏ లాంటి అధికారాలు గాని, విధులు, నిధులు గాని ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఆ విధానాన్ని అమలుచేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక్ష పద్దతుల ద్వారానే పంచాయతీలు గాని స్థానిక సంస్థల ఎన్నికలుగాని ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరోక్షవిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దానిన తాము ఖండిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఆ విధానం అమలుచేసినట్లయితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బోథ్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సదానందం, బిసిసెల్ అధ్యక్షుడు కట్ట భూమేష్, నాయకులు కె.గంగారాం, గంగాధర్, సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్ అనర్థాలపై అవగాహన
ఆదిలాబాద్ టౌన్,జనవరి 23: ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనార్థాలపై ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ శీతాకాల శిబిరాల్లో భాగంగా మంగళవారం మా వల, రాంనగర్ కాలనీల్లో ఇంటింటి సర్వే చేపట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మానుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. అదే విధంగా 25న ఓటర్స్‌డేను పురస్కరించుకొని ఓటు యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్1 ప్రోగ్రాం అధికారి విజయ కుమార్, యూనిట్2 ప్రోగ్రాం అధికారి మురళిలు పాల్గొన్నారు.