అదిలాబాద్

ఆదివాసీ ఆడపడుచులుగా కలెక్టర్, జడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 23: మారుమూల గిరిజన గ్రామాలకు అతిథులుగా వెళ్ళిన జిల్లా కలెక్టర్ దివ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికలకు ఆదివాసీ మహిళల నుండి అరుదైన స్వాగతం లభించడం అబ్బురపర్చింది. తమ గూడేనికి ఇద్దరు మహిళా అధికారులు రావడంతో సంబరపడ్డ ఆదివాసీ గిరిజన మహిళలు సాంప్రదాయ రీతిలో ఇద్దరు అతిథులను గౌరవించడమే గాక వారికి ఆదివాసీల కట్టు, బొట్టు, నగలు దరింపజేసి ముచ్చటతీర్చుకున్నారు. అంతటితో ఆగకుండా తమదైన రీతిలో మర్యాదపూర్వకంగా ఇద్దరు మహిళా అధికారులకు ముక్కు పోగు, చీరను అందజేసి తమ అతిథి మర్యాదలను చాటుకున్నారు. ఆదిలాబాద్ మండలం మారుమూల ఏజెన్సీ గ్రామామైన మామిడిగూడలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా, జిల్లా కలెక్టర్ డి.దివ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌లు హాజరయ్యా రు. ముందుగా ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ డోలు వాయిద్యాలు, తమ ఆచార వ్యవహారలతో ఘనంగా స్వాగతం పలికి, తమ జీవనశైలిని ప్రతిబింభిం చే విధంగా అధికారులను సత్కరించడంతో వారు ఆనందపరవశులయ్యారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ ఆదివాసీల జీవన విధానం, వారి సాంస్కృతి సాంప్రదాయాలు తనను ఎంతగానో కట్టిపడేశాయని, నేటి ఆధునిక యుగంలోను వారి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారని కొనియాడారు. ఆదివాసీ మహిళలు చిరుదరహాసంతో తమకు అతిథి మర్యాదలు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.