క్రైమ్/లీగల్

ఫాంహౌస్‌లో గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 5: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామ సమీపంలో గల ఫాంహౌస్‌లో ఆదిలాబాద్ టీచర్స్‌కాలనీకి చెందిన 15 ఏళ్ళబాలికపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటనలో నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌రేప్ కేసుకు సంబంధించి వివరాలను ఆదిలాబాద్ డిఎస్పీ నర్సింహారెడ్డి వెల్లడించారు. ఇంద్రవెల్లికి చెందిన రాథోడ్ సంజీవ్ ఆదివారం మధ్యాహ్నం ఆదిలాబాద్‌కు వచ్చి టీచర్స్‌కాలనీలో ఉండే బాలికతో ఫోన్‌లో సంభాషిస్తూ తన పరిచయం చేసుకోవడమే గాక ఆ బాలిక స్నేహితురాలు కూడా తన వెంట ఉందని నమ్మబలికాడు. ఆదిలాబాద్ పట్టణంలోని స్టార్ మెడికల్ షాపు వద్ద వేచి ఉంటానని చెప్పగా ఆ బాలిక రావడంతోనే స్విప్ట్ కారులో తీసుకొని లాండసాంగ్వి సమీపంలోని ఫాంహౌస్‌కు తీసుకవెళ్ళారు. రాథోడ్ సంజీవ్ వెంట ఇంద్రవెల్లికి చెందిన క్యాదర్‌వార్ విజయ్ ప్రకాష్, తెల్లూరి విశాల్, ఆదిలాబాద్ బ్రహ్మణవాడకు చెందిన గండ్రత్ సంతోష్‌లు ఫాంహౌస్‌లో బలవంతంగా తీసుకవెళ్ళి సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు డిఎస్పీ నర్సింహారెడ్డి, టౌన్ సిఐ సురేష్‌లు కేసు నమోదు చేసుకొని నలుగురు నిందితులను అరెస్ట్‌చేశారు. వారిపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్పీ నర్సింహారెడ్డి వివరించారు. ఈ కేసులో కారుతో పాటు సెల్‌ఫోన్లను స్వాదీనపర్చుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.