అదిలాబాద్

నేత్రపర్వంగా సీతారామ కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 15: శ్రీరామ నవమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. శుక్రవారం వేకువ జామునుండే ఆలయాలన్నీ భక్తుల తాకిడి, ప్రత్యేక పూజలతో కిటకిటలాడగా జిల్లాలోని పలు రామాలయాల్లో సీతాసహిత రామచంద్రుని కల్యాణ వేడుకలు అభిజిత్ లగ్న ముహూర్తాన కన్నుల పండగగా సాగాయి. సాంప్రదాయ బద్దంగా చతుర్వేద బ్రాహ్మాణ వేదమంత్రోశ్చరణల మద్య రాములోరి కల్యాణ వేడుకలను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. ఎక్కడ చూసిన జై శ్రీరామ్, శ్రీరామ్ చంద్ర మహారాజ్‌కి జై అన్న నినాదాలు మిన్నంటాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఉట్నూరు, బోథ్, తలమడుగు, చాందాటి, మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో కల్యాణ వేడుకలు తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీరామ నవమి ఉత్సవాలకు ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆదిలాబాద్‌లో జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, జిల్లా అధికారులు, ప్రముఖులు కల్యాణ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలతో తరించారు. ఆదిలాబాద్‌లోని కోదండరామాలయం, హౌసింగ్‌బోర్డులోని రామాలయం, మావల, చాందాటి లోని సీతారామ ఆలయాల్లో శ్రీరాముని కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా సాగగా రాష్ట్ర బిసి, అటవీ శాఖ మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఎంపి గెడం నగేష్, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తదితరులు కల్యాణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలం చాందాటి, బోరజ్, మావల, రాంనగర్ శ్రీరామ చంద్ర ఆలయాల్లో పండగ వాతావరణంలో కల్యాణ వేడుకలు జరగగా వేలాది మంది హాజరై అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కల్యాణ మహోత్సవ ఘట్టం భక్తులను పులకింప చేయగా తలంబ్రాలు పోసి సీతారాములకు కట్నకానుకలతో మొక్కులు చెల్లించుకున్నారు. చాందాటిలో వేలాది మంది మహిళలు రెండు గంటల పాటు జరిగిన కల్యాణమహోత్సవ వేడుకలను తిలకించగా మంత్రి జోగురామన్న సైతం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎక్కడ చూసిన ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పట్టణంలో హిందూ వాహిని అధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించగా, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా హాజరై యాత్రను ప్రారంభించారు. హనుమాన్, శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ రథాన్ని గోపాలచంద్ర మఠాధిపతి యోగానంద సరస్వతి ప్రారంభించగా, గోపాల కృష్ణ మఠం నుండి పట్టణ పురవీధుల గుండా సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. కాషాయ జెండాల నడుమ జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. మరోవైపు భైంసాలోనూ హిందూవాహిని అధ్వర్యంలో శ్రీరామ చంద్రుని శోభాయాత్ర కన్నుల పండగగా సాగగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే శ్రీరామ నవమి సంధర్భంగా బాసర, గూడెంగుట్ట, జైనథ్ లక్ష్మినరసింహాస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మండువేసవిని లెక్కచేయకుండా భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.