అదిలాబాద్

లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమనపల్లి, మే 22: మండలంలోని గొర్లపల్లి వాగుపై నిర్మిస్తున్న వంతెన కోసం లైన్ క్లియర్ అయింది. వంతెన నిర్మాణం కోసం 31 మందికి సంబంధించిన 7 ఎకరాల 1 గుంట భూమికి ముంపునకు గురి కాగా, పరిహారం తక్కువగా ఇస్తున్నారని రెండేళ్లుగా రైతులు బ్రిడ్జి పనులను అడ్డుకుంటున్నారు. దీంతో మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, స్థానిక తహసీల్దార్ సాయిబాబా ఆధ్వర్యంలో వేమనపల్లిలోని రెవెన్యూ కార్యాలయంలో ముంపు బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎకరాకు 7 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని, బ్రిడ్జి నిర్మాణానికి మీరంతా సహకరించాలని కోరారు. దీంతో మండల రైతు నాయకుడు పురాణం లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో రైతులు సమ్మతమేనని తెలపడంతో మార్గం సుగమమైంది. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ ఉద్యోగుల సమ్మె ప్రారంభం
కాగజ్‌నగర్, మే 22: గ్రామీణ పోస్టల్ సేవల పే కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం, ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కాగజ్‌నగర్‌లో పోస్టల్ ఉద్యోగులు సమ్మెకు దిగ్గారు. ఈ సందర్భంగా అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమాన్, గ్రూప్ డీ మంచిర్యాల బ్రాంచి కార్యదర్శి ఎండీ తాజుద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగుల వేతనాల పెంపు ఏర్పాటు చేసిన కమలేష్‌చంద్ర కమిటీ సిఫార్సుల అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా దేశ వ్యాప్తంగా మంగళవారం నుంచి సమ్మె ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ ఎన్‌సీఓ కార్యదర్శి భాస్కర్, ఎన్‌యూ జీడీఎస్ సంతోష్, ఎన్‌ఎఫ్‌పీఈ నాయకులు వెంకన్న, సతీష్, ఆలీ, సిరాజ్, ఆదిలాబాద్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ సంతోష్, మంచిర్యాల బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాగేశ్వర్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.