అదిలాబాద్

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావల,జూన్ 19: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు శ్రేయస్సుకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న అన్నారు. మవల మండలం వాఘాపూర్‌లో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూప్రక్షాళనతో రైతుల దశాబ్దాల భూ సమస్యలను దూరం చేయడం జరిగిందన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పెట్టుబడికి ఎకరానికి రూ.నాలుగు వేలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, మావల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, నాయకులు శుక్లాల్, స్వామి, కిరణ్, గోవర్దన్ రెడ్డి, రాజన్న, విలాస్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.