అదిలాబాద్

హరిత యజ్ఞానికి తరలి వచ్చిన గ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, జూలై 15: సకల ప్రాణ కోటి మనుగడకు మొక్కలే జీవనాధారమని మిషన్ ముధోల్ సభ్యులు పేర్కొన్నారు. రోజురోజుకూ వాతావరణలో పెరుగుతున్న కాలుష్యం నివారణకు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు. ఇందుకు గ్రామస్థులు తరలి వచ్చారు. ప్రభుత్వం సైతం పర్యావరణ పరిరక్షణను ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహరంలో భాగస్వాములు అవుతామన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ అవరణలో ఖాళీస్థలంలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగను తలపించింది. మిషన్ సభ్యులు చుట్టూ గడ్డపారతో గుంతలను తవ్వారు. మిషన్ ముధోల్ సభ్యులు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతన్న నేపథ్యంలో ఈ ఆదివారం ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ప్రతీ వారం వార్డుల్లోని మురుగు కాలువలను శుభ్రం చేయడం తోపాటు చెత్తచెదారాన్ని తొలగించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుని సంబంధిత ఆధికారులకు అందించారు. స్థానిక సామాజిక ఆస్పత్రిలోని సమస్యలను ఉన్నత ఆధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తమవంతుగా ప్రయత్నించారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరారు. మిషన్ ముధోల్ సభ్యు లు గ్రామంలోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి తమవంతుగా మొక్కలు నాటా రు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను సైతం వారే తీసుకున్నారు. గ్రామంలో ఖాళీస్థలాలు, మహలక్ష్మీ ఆలయం నుండి గిర్వాణీ డిగ్రీ కళాశాల రోడ్డు, బోధన్ గల్లీ, తానూర్ బైపాస్ రోడ్డు, ఆలయాల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం హరిత పండుగను తలపించింది. మిషన్ ముధోల్ ఆధ్వర్యంలో మొత్తం 500 వరకు మొక్కలు నాటామని తెలిపారు.