అదిలాబాద్

వద్దంటే వాన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 15: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతుండగా చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 28 మండలాల్లో సాధారణంకంటే అధికంగా వర్షపాతం నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 572.3మి.మీటర్ల వర్షపాతం నమోదుకావడం గమనార్హం. సీజన్ ప్రారంభం నుండి జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతులకు ఊరట కల్గించినప్పటికీ వారం రోజుల నుండి ముసురుపట్టిన వానలతో పత్తి చేలల్లో నీరు చేరి మొలక దశలోనే పత్తికి తెగుళ్ళు సోకడం రైతులను కలవరపెట్టిస్తున్నాయి. లోతట్టు భూములు, నీరు నిల్వ ఉండే పంట చేలల్లో మాత్రమే పత్తి పంటకు విల్ట్ సోకుతుందని, ఎండలు కాసినట్లయితే మొక్కలుఎదిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులంటున్నారు. జిల్లాలో మొలక దశలోనే పత్తి మొలకకు శ్వాస అందకుండా ఎనరోబిక్ వ్యాధి సోకుతుందని, సరైన పోషకాలతో కూడిన ప్లాంటోమైసిన్, కాపర్ అస్విఫ్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆదిలాబాద్ జిల్లాలో 330 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికి అదనంగా 65శాతం వర్షపాతం రికార్డు కావడం అతివృష్టికి అద్దంపడుతోంది. జిల్లాలో ఆదివారం రాత్రి కూడా రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం కాగా, పంట చేలల్లోకి నీరు చేరి తీవ్ర నష్టాన్ని కల్గించాయి. తలమడుగు, తాంసి, జైనథ్, బేల మండలాల్లో మొలక దశలోనే తెగుళ్ళు సోకుతుండడం, చేలల్లో నీరు నిల్వ ఉండడం అందోళనకు దారితీస్తుంది. జూన్ 1నుండి జిల్లావ్యాప్తంగా అధికంగా వర్షాలు కురవడంతో కలుపుకోత సమస్యగా మారింది. భీంపూర్ మండలంలో సాధారణ వర్షపాతం 276మి.మీ కురవాల్సి ఉండగా, శనివారంనాటికి 395మి.మీ వర్షంకురిసింది. జైనథ్ మండలంలో సాధారణ 328 మి.మీ వర్షపాతం కాగా, 575.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బేలలో 302 మి.మీ సాధారణ వర్షపాతానికిగాను 562.9మి.మీ కురిసింది. గాదిగూడలో 368.5 మి.మీకుగాను 410, నార్నూర్‌లో 365.2గాను రికార్డుస్థాయిలో 638 మి.మీ వర్షపాతం, ఇంద్రవెల్లిలో సాధారణ 378.8 మి.మీకుగాను 736 మి.మీ వర్షపాతం కురిసింది. గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, తాంసి, తలమడుగు, బోథ్ మండలాల్లోనూ సాధారణం కంటే అధికంగా 60 శాతం వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో పత్తి పంటకు వర్షాలు అనుకూలిస్తున్నా, నీటితడి అధికంగా ఉన్న భూముల్లో మాత్రం మొలక దశలో పత్తికి ఊహించనిరీతిలో తెగుళ్ళుసోకి పంటఎదుగుదలకు ప్రతిబందకంగామారాయి. ఉట్నూరు ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్, సిర్పూర్ మండలాల్లోనూ వర్షాలు పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయ. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలవల్ల కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరుచేరి వరి రైతుల్లో ఆనందం కల్గిస్తున్నాయి. ఇప్పటికే కడెం, గడ్డెన్నవాగు, సాత్నాల, మత్తడివాగు, కుమురంభీం, నిల్వాయి ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. కడెం ప్రాజెక్టు పరిధిలోని ఐదు మండలాల్లో వరి నాట్లుకు వాతావరణం అనుకూలంగా మారింది.