అదిలాబాద్

కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌కు వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 17: కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో ముందుకెళ్ళాలని, ఇందుకోసం పీడియాక్ట్ కేసుల కు కూడా వెనకాడబోమని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అటవీ అధికారులు, పోలీసు అధికారులతో కలప స్మగ్లింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజీపీ మహేందర్‌రెడ్డి, అటవీశాఖకు చెందిన పిసిసిఎఫ్ ఝా మాట్లాడు తూ అటవీ సంపదను రక్షించేందుకు అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు తెలిపారు. తరచూ స్మగ్లింగ్‌కు పాల్పడే అక్రమార్కులపై నాన్ బెయిలెబుల్ పీడియాక్ట్ కేసులు నమోదుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం సంయుక్తం గా టాస్క్ఫోర్స్ దళాలను ఏర్పాటుచేసి అక్రమ కలప స్థావరాలపై దాడులు నిర్వహించాలని జిల్లా పోలీసులకు సూచించారు.

భవన నిర్మాణ కార్మికులకు ఆధార్ అనుసంధానం
ఇచ్చోడ, జూలై 17: భవన నిర్మాణరంగంలో పనులు చేస్తున్న కార్మికులు వెం టనే ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇచ్చోడలోని కార్మికశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ 2009 నుండి 2018 వరకు కార్మికులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని, ఆసమయంలో ఆధార్ అనుసంధానం లేకపోవడంతో ప్రభుత్వం భవ న నిర్మాణ కార్మికులందరికి ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయక పథకాలు పొందాలంటే భవన కార్మికులందరూ వెంటనే తమ ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రిజిస్టర్ చేయించుకున్న కార్మికులు ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనట్లయితే తొలగించబడుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికై ఇచ్చోడలో 24న అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నూతన సభ్యత్వాలు చే సుకునేవారు సైతం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను అందిపుచ్చుకునేందుకు కార్మికులను చైతన్యపరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సురేష్, కార్మికశాఖ సిబ్బంది పాల్గొన్నారు.