అదిలాబాద్

పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఆగస్టు 14: తెల్లరేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పేద ఆడపిల్లల పెళ్లిలకి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్మల్ అర్బన్, రూరల్ మండలంనకు సంబంధించిన 275 మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. ఒక కోటి 76 లక్షల 90 వేల 824 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకి రాష్ట్ర సీఎం కేసీఆర్ పెద్దన్నల పెళ్లి ఖర్చుల కింద రూ. ఒక లక్ష 116లు అందిస్తున్నారని తెలిపారు. కుల, మత, ప్రసక్తి లేకుండా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 18 సంవత్సరాలు నండిన ఆడపిల్లల పెళ్లిళ్లకి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పెళ్లి ఖర్చుల కింద రూ. ఒక లక్షల 116లు అందిస్తున్నారన్నారు. అలాగే ఆగస్టు15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్, కురాన్నపేట్‌లలో మధ్యాహ్నం 3 గంటలకు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతీ

గ్రామంలో కంటి వెలుగు శిభిరాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఉచిత కంటి చికిత్సలతో పాటు కళ్లజోళ్లు, మందులు అవసరమైతే వారికి ముధోల్‌లోని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి
* కుటుంబ సభ్యులతో బోటు విహారం
కడెం, ఆగస్టు 14: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును మంగళవారం హైదరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటిపెల్లి జనార్ధన్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు జలాశయం, ప్రాజెక్టుకు చెందిన వరద గేట్లు, కడెం ప్రాజెక్టు ప్రకృతి అందాలను వారు తిలకించారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలో గల పర్యాటకశాఖ బోటులో కడెం జలాశయంలో తమ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి బోటు విహారం చేస్తూ కడెం ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం ప్రాజెక్టు బోటింగ్‌పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్‌ను తలపించే లా ఉందన్నారు. కడెం ప్రాజెక్టు వద్ద ప్రకృతి అందాలు చాలా బాగున్నాయని ఆయన అన్నారు. కడెం ప్రాజెక్టు మంచి పర్యాటక కేంద్రం అని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ ఏర్పాటులో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఉపాధ్యాయులకు పీ ఆర్‌సీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఏకీకృత సర్వీస్‌రూల్స్ అమలైతే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభిస్తాయని, రెగ్యులరేషన్ కూడా అవుతుందని ఆయన తెలిపారు. ఆయనవెంట పీ ఆర్‌టీయు నిర్మల్ జిల్లా అధ్యక్షులు రమణరావు, జిల్లా ప్రధానకార్యదర్శి నరేంద్రబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోట వేణు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అడ్డగూరి ప్రభాకర్, కడెం అధ్యక్షులు జొన్నల రవీందర్, మండల ప్రధానకార్యదర్శి కె.శ్రీనివాస్, దస్తురాబాద్ అధ్యక్షులు కొమురయ్య, కార్యదర్శి బుచ్చన్న, పలువురు పీ ఆర్‌టీయు నాయకులు ఉన్నారు.